సినిమా ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలు హీరోయిన్లను డిన్నర్ లకు పిలుస్తుంటారని కానీ దాని వెనుక మరో ఉద్దేశం ఉంటుందని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా. ప్రస్తుతం ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న నేపధ్యంలో చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు.

తాజాగా నటి షెర్లిన్ చోప్రా కూడా కొన్ని కామెంట్స్ చేసింది. తరచూ బోల్డ్ ఫోటో షూట్లలో పాల్గొంటూ కనిపించే ఈ భామ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంలో ఆమె బాలీవుడ్ లో దర్శకనిర్మాతలు డిన్నర్ కి పిలిచారంటే దాని అర్ధం ఏంటో వివరించారు.

దర్శకనిర్మాతలు అప్పుడప్పుడు డిన్నర్ అని పిలిచినప్పుడు అది కేవలం డిన్నర్ కోసం మాత్రమే కాదని, సెక్సువల్ ఫేవర్ కోసమని గ్రహించాలని తెలిపింది. తాను అవకాశాల కోసం దర్శకులు లేదా నిర్మాతల వద్దకు వెళ్లినప్పుడు వారు డిన్నర్ కి పిలిచేవారని, మొదట్లో అనుమానం కలిగేదని ఆ తరువాత మెల్లగా అర్ధమైందని వెల్లడించారు.

చిన్న చిన్న పట్టణాల నుండి వచ్చినవారికి ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఎదురవుతాయని చెప్పుకొచ్చింది.