శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ సూప‌ర్ హిట్ అయ్యింది ఇంత‌టితోనే ఆగ‌కుండా ఫిదా2 మూవీని తీయాల‌నుకుంటున్న శేఖ‌ర్ క‌మ్ముల త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది వచ్చిన సూపర్ సక్సెస్ సినిమాల లిస్టులో ఈ మూవీ నిలిచిపోయింది. 'ఫిదా' సినిమా వ్యవహారం ఇంతటితో అయిపోలేదని, శేఖర్ కమ్ముల నుండి మరో ఫిదా రాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఫిదా మూవీ సక్సెస్తో జోరు మీద ఉన్న శేఖర్ కమ్ములకు. అలాంటి సినిమా తీయాలని చాలా ఆఫర్లు వస్తున్నాయట. శేఖర్ కమ్ముల కూడా అలాంటి ఆలోచనే చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన స్క్రిప్టు వర్కు మీద మునిగిపోయారని, త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు
