సినీ నటుడు రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ ప్రదర్శన నిలిపివేతపై ఆ చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి స్పందించారు. సుధాకర్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన సినిమాను ఆపేసి అన్యాయం చేశారని చెప్పారు. 

సినీ నటుడు రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ ప్రదర్శన నిలిపివేతపై ఆ చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి స్పందించారు. సుధాకర్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన సినిమాను ఆపేసి అన్యాయం చేశారని చెప్పారు. సినిమాకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లన్నీ తన వద్దే ఉన్నాయని తెలిపారు. సినిమాలో శివానీ, శివాత్మిక పేర్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కానీ సినిమాకు శివానీ, శివాత్మికలు నిర్మాతలు కారని తెలిపారు. తాను దుబాయ్‌లో ఉంటానని చెప్పారు. ఒకే ఇంట్లో డైరెక్టర్, ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు.. అందుకే వారు పేర్లు వేసుకున్న మేము అభ్యంతరం చెప్పలేదని అన్నారు. దాని వల్ల లీగల్ ఇష్యూస్ వస్తాయని తెలిస్తే .. అలా చేసేందుకు అంగీకరించే వాళ్లం కాదని చెప్పారు. లీగల్‌గా తానే ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌ అని చెప్పారు. 

జీవితకు, వేరే వాళ్లకు మధ్య ఏముందో తనకు తెలియదన్నారు. వాళ్ల ప్రాబ్లమ్‌తో తన ఆస్తిని ఎలా అటాచ్ చేస్తారని ప్రశ్నించారు. అదే విషయం డిజిట్ ప్రొవైడర్స్‌కు చెప్పామని తెలిపారు. డిజిటల్ ప్రొవైడర్స్ ఆపేయడం వల్లే సినిమా ఆగిపోయిందని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. శేఖర్ సినిమా ఆపేయమని కోర్టు ఏ ఆర్డర్ ఇవ్వలేదన్నారు. ప్రాపర్టీ అటాచ్‌మెంట్ చేయమని మాత్రమే చెప్పిందన్నారు. 

డిజిటల్ ప్రొవైడర్లకు డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పారు. డిజిట్ ప్రొవైడర్స్ సుధాకర్ రెడ్డితో అగ్రిమెంట్ చేసుకున్నది తాను మాత్రమేనని.. శివానీ, శివాత్మికతో కాదని అన్నారు. డిజిటల్ ప్రొవైడర్లు సినిమాను చంపేశారని ఆరోపించారు. తాను ఏడెనిమిది సినిమాకు నిర్మాతగా పనిచేశానని చెప్పారు. ఏ సినిమాకు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. డిజిటల్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్‌వోలపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. రేపు కోర్టులో తీర్పు వచ్చాక పరంధామ రెడ్డిపై పరువు నష్టం దావా వేయనున్నట్టుగా చెప్పారు. తనకు కలిగిన నష్టాన్ని పరంధామరెడ్డి ఇస్తారా..?, డిజిటల్ ప్రొవైడర్లు ఇస్తారా..? అని ప్రశ్నించారు. జీవిత, రాజశేఖర్ వల్ల తనకు ఎలాంటి నష్టం కలగలేదని చెప్పారు. శేఖర్ సినిమా సర్టిఫికెట్ తన పేరు మీదే ఉందన్నారు. శేఖర్ సినిమాకు తాను రూ. 15 కోట్ల పెట్టుబడి పెట్టానని చెప్పారు.