రాకేష్ మాస్టర్ మరణించిన నేపథ్యంలో మిత్రులు, సన్నిహితులు, అభిమానులు ఆయన భౌతికకాయాన్ని సందర్శిస్తున్నారు. నివాళులు అర్పిస్తున్నారు. శిష్యుడు శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ భౌతికకాయం చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.
ఆదివారం సాయంత్రం రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఒక వారం రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిన్న రక్త విరేచనాలు కావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. షుగర్ పేషేంట్ అయిన రాకేష్ మాస్టర్ షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి గురైన రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు.
నేడు అభిమానులు, సన్నిహితుల సందర్శనార్థం రాకేష్ మాస్టర్ భౌతికకాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు. రాకేష్ మాస్టర్ శిష్యుడైన శేఖర్ మాస్టర్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. నివాళులు అర్పించారు. రాకేష్ మాస్టర్ ని చూసిన శేఖర్ మాస్టర్ కన్నీటి పర్యంతమయ్యారు. శేఖర్ మాస్టర్ జర్నీ రాకేష్ మాస్టర్ వద్ద మొదలైంది. కష్టసుఖాల్లో ఇద్దరూ కలిసి ఉన్నారు.
కొన్నాళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యారు. కొన్ని విషయాలలో అనుకోకుండా విభేదాలు తలెత్తాయి. శేఖర్ ఎదగాలి, బాగుండాలి. అయితే నేను చనిపోయితే నా శవాన్ని కూడా తకొద్దని నేను చెబుతాను. ఇకపై నేను వాడిని కలవను అన్నాడు. కాగా రాకేష్ మాస్టర్ తన శవం ఎక్కడ పూడ్చి పెట్టాలో ముందే చెప్పారు. బోరబండ శివగంగా నగర్ లో గల స్మశానవాటికలో ఒక వేప చెట్టు నాటిన రాకేష్ మాస్టర్, తాను మరణిస్తే ఆ చెట్టు క్రింద పూడ్చిపెట్టాలని కోరాడు.
