ఫిదా సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని స్టార్ దర్శకుల జాబితాలో చేరిన శేఖర్ కమ్ముల నెక్స్ట్ కూడా అదే తరహాలో హిట్స్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త నటీనటులతో ఒక సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్న కమ్ముల ఆ తరువాత నాగచైతన్య - సాయి పల్లవి ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 

అయితే ఆ సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ అప్డేట్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫిదా సినిమాలో తెలంగాణ పిల్లగా మాస్ డైలాగ్స్ తో ఆకర్షించిన అమ్మడు ఇప్పుడు ఆంధ్ర క్లాసికల్ డ్యాన్సర్ గా స్మూత్ గా కనిపించనుందట. ఇక నాగ చైతన్య మాత్రం మాస్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. 

డ్యాన్స్ లో ఇరగదీసే సాయి పల్లవికి తనకు తగ్గ పాత్ర దొరకడంతో సినిమాలో డ్యాన్స్ సీన్స్ హైలెట్ గా ఉంటాయని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తన మార్క్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాస్త ప్రయోగాత్మకమైన సినిమా అనే చెప్పాలి. కానీ శేఖర్ కమ్ముల సరికొత్త తరహాలో ట్రై చేస్తున్నారంటే ఎంతో కొంత స్పెషల్ గా ఉంటుంది.