Asianet News TeluguAsianet News Telugu

'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ ట్రైలర్.. అల్లు అర్జున్ ని కార్తీక్ ఆర్యన్ మ్యాచ్ చేయగలిగాడా ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే.

Shehzada Official Trailer out now
Author
First Published Jan 13, 2023, 6:04 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. బన్నీ కెరీర్ లోనే ఆ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలని బాలీవుడ్ వాళ్ళు వదలడం లేదు. 

అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాలు అక్కడ ఆల్రెడీ రీమేక్ అయ్యాయి. ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రం కూడా రీమేక్ అవుతోంది. రోహిత్ ధావన్ దర్శకత్వంలో.. యువహీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని షెహజాద అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

దీనితో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. రీమేక్ మూవీ అనగానే ఒరిజినల్ వర్షన్ తో కంపారిజన్ ఉంటుంది. షెహజాద ట్రైలర్ ని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒరిజినల్ వర్షన్ తో పోల్చుతున్నారు. కార్తీక్ ఆర్యన్ తన స్టైల్ లో చేయాలని ప్రయత్నించినప్పటికీ గెటప్స్ విషయంలో బన్నీని ఫాలో అయ్యాడు. మ్యానరిజమ్స్ కూడా చాలా వరకు బన్నీని గుర్తు చేస్తున్నాయి.    

కార్తీక్ ఆర్యన్ కి ఈ పాత్ర బాగానే సూట్ అయింది. తెలుగులో పూజా హెగ్డే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలిసిందే. కానీ ఇక్కడ కృతి సనన్ పాత్రలో ఆ మ్యాజిక్ కనిపించడం లేదు. తెలుగులో మురళి శర్మ పోషించిన పాత్రని.. హిందీలో పరేష్ రావల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తాత పాత్రలో మాత్రం సచిన్ ఖేడ్కర్ కొనసాగుతున్నారు. ఫైట్స్ , సెటప్ అంతా పూర్తిగా అల వైకుంఠపురములో చిత్రాన్నే గుర్తు చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios