ఫ్యామిలీ ఆడియెన్స్ కి అలాగే యూత్ పాజిటివ్ గా కనెక్ట్ అయ్యే హీరోల్లో శర్వానంద్ ముందుంటాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ హీరో ఒక ఫుల్ యాక్షన్ సినిమాతో రెడీ అవుతున్నాడు. స్వామి రారా - కేశవ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుదీర్ వర్మ శర్వాతో గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

రేపు శర్వా పుట్టినరోజు కావడంతో సినిమాకు సంబందించిన ప్రీ లుక్ ని రిలీజ్ చేశారు.త్వరలోనే సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక సినిమాలో శర్వా సరికొత్త డాన్ గా దర్శనమివ్వనున్నాడు.  సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరో హీరోయిన్ గా హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శిని కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.