శతమానంభవతి చిత్రం టీమ్ ను అభినందించిన సీఎం కేసీఆర్ సంక్రాంతికి రిలీజై గ్రాండ్ సక్సెస్ సాధించిన శతమానంభవతి చక్కని కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్న
శర్వానంద్ హీరోగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.24 చిత్రం 'శతమానంభవతి' రిలీజై సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ మూడు తరాలకు సంబంధించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి14న విడుదలయి ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సాధారణంగా పెద్దలు ఆశీర్వదించేటప్పుడు చెప్పే 'శతమానం భవతి' అనే టైటిల్‌లోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. దీన్ని యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా తెరకెక్కించి హిట్ అందుకున్నారు నిర్మాత దిల్ రాజు అండ్ టీమ్. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శతమానంభవతి టీమ్ ను అభినందించారు.
దిల్ రాజు మాట్లాడుతూ... డైరెక్టర్ సతీష్ వేగ్నేశ చెప్పిన పాయింట్‌ను అందరికీ నచ్చేలా స్క్రిప్ట్ తయారు చేయడానికి టైం పట్టింది. మంచి సినిమాను తీయాలని డైరెక్టర్ సతీష్ వేగ్నేశ చాలా కష్టపడ్డాడు. హీరో శర్వానంద్ హీరో కావాలనుకున్నప్పుడు డైరెక్టర్ తేజకు తనని నేనే పరిచయం చేశాను. పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు శర్వానంద్ మా బ్యానర్‌లో సినిమా చేయాలని రాసి పెట్టి ఉండటం వల్లే ఈ శతమానంభవతిలో తను హీరోగా చేశాడు. ఈ సినిమా హిట్ కావడం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.
ఈ చిత్రంలో నటీనటులు :
శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్
సాంకేతిక నిపుణులు :
ఛాయాగ్రహణం – సమీర్ రెడ్డి
సంగీతం - మిక్కీ జె. మేయర్
సాహిత్యం - శ్రీ సీతారామశాస్త్రి , రా
కూర్పు - మధు
కళా దర్శకుడు – రమణ వంక
కథ - కథనం –మాటలు-దర్శకత్వం - వేగేశ్న సతీష్
