సీక్వెల్ కు సిద్దం అవుతోంది శర్వానంద్ సూపర్ క్లాసిక్ మూవీ శతమానం భవతి. అయితే  ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ హీరో శర్వానంద్. మరి శర్వా లేకుండా సీక్వెల్ సాధ్యం అవుతుందా..?  

ఎప్పుడో ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చింది శతమానం భవతి సినిమా. అప్పుడు సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి..బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది సినిమా. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మాతగా శతమానం భవతి సినిమా తెరకెక్కింది. అంతే కాదు ఈసినిమా థిమ్కు తగ్గట్టు గానే సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి పండగకు ఓ కుటుంబం, బంధాలు, అనుబంధాలతో కూడిన ఎమోషనల్ కంటెంట్ ఉండటంతో.. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కంటతడిపెట్టించింది. అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించింది. 

ఇక ఈ సినిమా నేషనల్ అవార్డు, నంది అవార్డుతో పాటు అనేక అవార్డులు అందుకుంది. కాగా త్వరలో ఈసినిమాకు సీక్వెల్ రాబోతోంది. రీసెంట్ గానే శతమానం భవతి సినిమాకు సీక్వెల్ ని ప్రకటించారు టీమ్. అంతే కాదు అప్పటిలాగానే.. దిల్ రాజు నిర్మాణంలోనే ఈ సీక్వెల్ తెరకెక్కబోతోంది. శతమానం భవతి నెక్స్ట్ పేజీ అంటూ ప్రకటించారు. అంతే కాదు రిలీజ్ డేట్ ను కూడా ముందే ఇచ్చేశారు. 2025 అంటే.. వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు మూవీని. 

అయితే ఇక్కడే చిన్న క్లారిటీని మూవీ టీమ్ ఇవ్వాల్సి ఉంది. ఈసినిమా అయితే అనౌన్స్ చేశారు కాని... ఏ హీరోతో ఈసినిమాను తీస్తున్నారో మాత్రం ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ అయితే శతమానం భవతి సీక్వెల్ లో నటించడు అని తెలుస్తుంది. దానికి కారణం కూడా ఉంది. ఈనెల 6న శర్వానంద్ పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా శర్వానంద్ సినిమాల అనౌన్స్ మెంట్లు బయటకు వచ్చాయి శర్వానంద్ 35, 36, 37 సినిమాలని అధికారికంగా ప్రకటించారు. ఈ లిస్ట్ లో శతమానం భవతి సీక్వెల్ లేకపోవడంతో ఈ విషయాన్ని కన్ ఫార్మ్ చేసుకుంటున్నారు జనాలు. 

Scroll to load tweet…

 ఒకవేళ శతమానం భవతి సీక్వెల్ లో శర్వానంద్ ఉండి ఉంటే.. ఇప్పటికే ప్రకటించిన లిస్ట్ లో ఈ పేరు ఉండాలి కదా..? లేకపోతే మేకర్స్ సర్ ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశారా అనేది కూడా అనుమానంగానే ఉంది. శర్వానంద్ బర్త్ డేకు.. దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం, శర్వానంద్ నెక్స్ట్ మూడు సినిమాలు ప్రకటించడంతో ఈ సినిమాలో శర్వానంద్ లేడనేది స్పష్టం అవుతోంది. 

అయితే శతమానం భవతి సీక్వెల్ లో దిల్ రాజు తమ్ముడి కొడుకు, హీరో ఆశిష్ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఆశిష్ ప్రస్తుతం రౌడీ బాయ్స్ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆశిష్ తోనే శతమానం భవతి సీక్వెల్ ఉంటుందని టాలీవుడ్ లో వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే శతమానం భవతి సినిమాకు వచ్చినంత రీచ్ ఈ సినిమాకి వస్తుందా చూడాలి.ఇక దిల్ రాజుకు ఎక్కువ సినిమాలు చేస్తున్న అనుపమా పరమేశ్వరన్.. ఈసినిమాలో హీరోయిన్ గా ఉండే అవకాశాలు ఎక్కువ. శతమానం భవతిలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది.