సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ అందుకుంటే చాలు ఎంత పెద్ద స్టార్స్ అయినా దర్శకులతో వర్క్ చేయడానికి ఇష్టపడతారు. కథపై అనుమానాలు ఉన్నా కూడా హిట్టి కొట్టిన దర్శకుడికి నో చెప్పే సందర్భాలు చాలా తక్కువ. అయితే శర్వానంద్ మాత్రం తనకు నచ్చకపోతే ఎలాంటి దర్శకులకైనా నో చెప్పేస్తాను అంటున్నాడు 

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న సందీప్ వంగకు వరుసగా ఆఫర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ తో బిజీగా ఉన్న ఈ యువ దర్శకుడు నెక్స్ట్ మహేష్ ని డైరెక్ట్ చేసే అవకాశం కూడా కొట్టేశాడు. ఇకపోతే సందీప్ కొన్ని రోజుల క్రితమే శర్వాకి ఒక కథను వినిపించాడట. అయితే శర్వా దాన్ని కూడా సున్నితంగా తిరస్కరించాడట. 

అసలైతే మొదట అర్జున్ రెడ్డి కథను శర్వానే చేయాలి. కానీ శర్వానంద్ ఒప్పుకోలేదు. కథ నచ్చడంతో పాటుగా క్యారెక్టర్‌ కూడా కంఫర్టబుల్‌గా అనిపిస్తేనే సినిమా చేస్తాను అని వివరణ ఇచ్చాడు. దీన్నిబట్టి ఈ కుర్ర హీరో కెరీర్ ను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడో చెప్పవచ్చు. శర్వా ఇటీవల నటించిన పడి పడి లేచే మనసు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.