కెరీర్ మొదటి నుంచి శర్వానంద్ డిఫరెంట్ కథలతో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా తనకంటూ ఒక మార్కెట్ ను కూడా సెట్ చేసుకోవడంతో ఈ కుర్ర హీరోతో సినిమాలు చేయడానికి దర్శకులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం శర్వా పడి పడి లేచే మనసు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. 

ఈ సినిమా అనంతరం శర్వా గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోయే యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటివరకు లవ్ స్టోరీలతో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు డాన్ గా కనిపించి 1980 కాలంలోనినడిచే కథలో గన్నులతో కనిపించడానికి సిద్దమవుతున్నాడు. పడి పడి లేచే మనసు సినిమా పూర్తిగా లవ్ ఎంటర్టైనర్. ఇక నెక్స్ట్ సినిమా మాత్రం ఈ సినిమా బిన్నంగా తెరకెక్కుతోంది. 

సుదీర్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఆ గ్యాంగ్ స్టర్ షూటింగ్ ఇప్పటికే 50% పూర్తయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్న ఆ సినిమా తప్పకుండా సరికొత్త థ్రిల్ కలిగిస్తుందని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్వానంద్ తెలిపాడు. ఇక పడి పడి లేచే మనసు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.