టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ యువీ క్రియేషన్స్ నుంచి ఏ సినిమా వచ్చినా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉంటాడు. ఇక ఇతర హీరోల సినిమాలపై స్పందించేది చాలా తక్కువ. ఇకపోతే గతంలో యువీ బ్యానర్ లో రెండు సినిమాలు చేసిన శర్వానంద్ కు ప్రభాస్ మరోసారి మద్దతుగా నిలిచాడు. శర్వా పడి పడి లేచే మనసు శుక్రవారం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ సినిమాకు స్టార్ నుంచి విషెష్ అందుతున్నాయి. ప్రభాస్ ను అన్న అని పిలిచే శర్వానంద్ కు మంచి విషెస్ అందాయి. రేపు సినిమా రిలీజ్ అవుతున్న సందర్బంగా శర్వానంద్ కు అలాగే చిత్ర యూనిట్ కు ప్రభాస్ బెస్ట్ విషెష్ చెప్పారు. అల్లు అర్జున్ ని పిలిచి ప్రీ రిలీజ్ వేడుకతో ఒక్కసారిగా అందరిని ఆకర్షించిన శర్వా ఇప్పుడు ప్రభాస్ నుంచి కూడా విషెష్ అందడంతో రెబల్ స్టార్ అభిమానుల నుంచి కూడా మద్దతు అందుతోంది. 

అటు మెగా ఫ్యాన్స్ - ఇటు  రెబల్ ఫ్యాన్స్ సపోర్ట్ తో శర్వా మనసు ఇప్పుడు నిజంగానే పడి పడి లేస్తోంది.సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మంచి ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రసాద్ - సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు.