శర్వానంద్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌ జంటగా నటిస్తున్న చిత్రం `శ్రీకారం`. కిశోర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌ని యంగ్‌ హీరోస్‌ నాని, వరుణ్‌ తేజ్‌, నితిన్‌ విడుదల చేశారు. శర్వానంద్‌ కోసం ఈ ముగ్గురు హీరోలు ఒకేసారి ఈ ట్రైలర్‌ని విడుదల చేయడం విశేషం. రేపు(మార్చి 6) శర్వానంద్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేయడం విశేషం.

ట్రైలర్‌ విడుదల సందర్భంగా నాని చెబుతూ, `ఒక మంచి ఆలోచనతో, మంచి టీమ్‌ కలిసి రావడం మంచి ఫలితాన్నిస్తుంది. ముందుగా శర్వానంద్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని తెలిపారు. మరోవైపు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ట్రైలర్‌ ఉందని వరుణ్‌ తేజ్‌ తెలిపారు. అలాగే హిట్‌ కళ కనిపిస్తుందని నితిన్‌ చెప్పారు. 

హైయ్యర్‌ స్టడీస్‌ చేసిన శర్వానంద్‌ విదేశాల్లో కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం చేయాల్సింది పోయి, వ్యవసాయం చేస్తాననడం, టెక్నాలజీ వాడుకుని ఆయన వ్యవసాయం చేయడం, ఊరు ప్రజలను కదిలించి కలిసికట్టుగా వ్యవసాయం చేస్తే, మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం వంటి అంశాల ప్రధానంగా సినిమా సాగుతుందని ట్రైలర్‌ బట్టి తెలుస్తుంది. ఇందులో శర్వా చుట్టూ హీరోయిన్‌ ప్రియాంక తిరగడం, అలాగే శర్వాకి, ఆయన తండ్రికి మధ్య ఎమోషన్స్, రిలేషన్స్ వంటివి ఆకట్టుకుంటున్నాయి. 14రీల్స్ పతాకంపై రామ్‌ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.