శర్వానంద్ హీరోగా దర్శకుడు సుధీర్ బాబు రూపొందిస్తోన్న చిత్రం 'రణరంగం'. సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతున్నా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. మొన్నటివరకు సినిమాకి టైటిల్ ఫిక్స్ అవ్వకపోవడంతో పక్కనపెట్టారు.

ఇప్పుడు టైటిల్ ఫిక్స్ అయిన తరువాత కూడా సినిమాను వాయిదా వేయాల్సిన పరిస్థితి కలుగుతోంది. లెక్క ప్రకారం సినిమాను ఆగస్ట్ 2న విడుదల చేయాలి. కానీ ఇప్పుడు ఆ డేట్ నుండి సినిమా దాదాపు తప్పుకున్నట్లేనని చెబుతున్నారు.

సినిమాకు సంబంధించి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పని పూర్తికాలేదు. ఈ పది రోజుల్లో పని పూర్తి చేసి రిలీజ్ చేసే ఛాన్స్ లేదని అంటున్నారు. పైగా శర్వానంద్ కొన్ని మార్పులు చెప్పాడని.. అవి చేయడానికి ఇంకాస్త టైం పడుతుందని తెలుస్తోంది. ఆ కారణంగానే సినిమాను ఆగస్ట్ 2కి విడుదల చేయలేమోనని మేకర్లు భావిస్తున్నారు.

మరో మంచి డేట్ చూసుకొని సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో శర్వా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు.