శర్వానంద్‌ హీరోగా  సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రం ‘రణరంగం’. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయన్స్ గా చేస్తున్న ఈ చిత్రం  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని  స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  నేపధ్యంలో  ఈ చిత్రం   ట్రైలర్‌ విడుదల  చేసారు. ఈ ట్రైలర్  రిలీజ్ ఈవెంట్ ని సైతం  ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి, ట్రైలర్‌ విడుదల చేశారు.  ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.  పూర్తి గా మాస్ లుక్ లో శర్వానంద్ కనపడిన ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

ఇక ఈ ట్రైలర్  థీమ్.. ఒక  సాధారణం వ్యక్తి  వ్యవస్దనే శాశించేలా ఒక శక్తిగా ఎలా ఎదిగాడనే విషయం చుట్టూ కథ అల్లి ఈ సినిమాను తెరకెక్కించారు.  ఎన్టీఆర్ 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్యనిషేధం విధించిన  రోజుల నేపథ్యంలో ఈ సినిమాను విశాఖ పట్నం బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కించారు.  అప్పుడున్న పరిస్దితులను ఆసరా చేసుకుని  హీరో లిక్కర్ సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే దానిపై ఈ సినిమాను తెరకెక్కించినట్టు  అర్దమవుతోంది. 

అలాగే ఈ ట్రైలర్ చూస్తూంటే.. కమల్ హాసన్ నాయకుడు, ప్రభాస్ ఛత్రపతి, యశ్ KGF సినిమాల నుంచి ప్రేరణ పొంది తెరకెక్కించినట్టు అర్దమవుతోంది.  ఇందులో శర్వానంద్‌ పాత్ర రెండు భిన్న కోణాల్లో సాగనుంది. ప్రశాంత్‌ పిళ్లై సంగీతం అందిస్తున్న  ఈ చిత్రాన్ని... హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.