Asianet News TeluguAsianet News Telugu

#OOJ: 'ఒకే ఒక జీవితం' ఓటిటి రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్

ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. శర్వా ను అందరూ మెచ్చుకున్నారు. అనుకున్న స్దాయిలో రెవిన్యూ జనరేట్ చెయ్యలేకపోయినా శర్వా ని ఫ్లాఫ్ ల పరంపర నుంచి ఒడ్డున పడేసిందనే చెప్పాలి. ఇప్పుడీ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

Sharwanand Oke Oka Jeevitham OTT release date
Author
First Published Sep 27, 2022, 11:54 AM IST


 శర్వానంద్ కు ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే వెళ్లిపోతోంది. మినిమం కలెక్షన్స్, ఓపినింగ్స్ రప్పించలేకపోతోంది. ఈ క్రమంలో టైమ్ ట్రావెల్ నేపధ్యంలో శర్వా ఓ చిత్రం చేసారు.  కెరీర్‌‏లో 30వ సినిమాగా రూపొందిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న రిలీజ్ చేసారు. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. శర్వా ను అందరూ మెచ్చుకున్నారు. అనుకున్న స్దాయిలో రెవిన్యూ జనరేట్ చెయ్యలేకపోయినా శర్వా ని ఫ్లాఫ్ ల పరంపర నుంచి ఒడ్డున పడేసిందనే చెప్పాలి. ఇప్పుడీ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

 ఈ చిత్ర ఓటిటి రైట్స్ సోనీ లివ్ సంస్థ తెలుగు, తమిళ భాషలకు కొనుగోలు చేసింది. ఈ రైట్స్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు సమాచారం. అలాగే విడుదలైన ఆరు వారాల తర్వాత సినిమాను స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం చేసుకున్నారు. అంటే అక్టోబర్ రెండో వారంలో ఈ చిత్రం ఓటిటి సంస్థ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

  ఈ సినిమాకి తరుణ్ భాస్కర్‌ డైలాగ్స్ రాశారు.  టైమ్‌ మెషీన్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ముగ్గురు స్నేహితులైన శర్వానంద్‌, ప్రియదర్శి, వెన్నెల కిషోర్  ప్రెజంట్ నుంచి ఫ్యూచర్ లోకి రావడం కథపై ఆసక్తిని క్రియేట్ చేసింది. సినిమాలో తల్లీకొడుకుల సెంటిమెంట్ కూడా బాగానే పండింది.   జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ సినిమాకి పని చేసారు. తెలుగు తమిళ భాషల్లో విడుదలైంది.

చిత్రం కథమిటంటే... 
గిటారిస్ట్ ఆది (శర్వానంద్) , అద్దె ఇళ్ల బ్రోకర్ శ్రీను (వెన్నెల కిషోర్), పెళ్లి కోసం పరితపిస్తున్న చైతు (ప్రియదర్శి)ముగ్గురూ క్లోజ్ ప్రెండ్స్.  ఎవరి పర్శనల్ సమస్యలతో వారు  సతమతమవతూంటారు. జీవితంలో తెలియని అసంతృప్తి. ముఖ్యంగా ఆదికి తల్లి (అమల) లోటు బాగా ఫీల్ అవుతూంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి సంగీతం పై దృష్టి పెట్టేలా చేసిన ఆమె ఇరవై ఏళ్ల క్రితం చనిపోతుంది. ఆమే పదే పదే గుర్తు వస్తూంటుంది. ఆమె ఉంటే బాగుండును అనిపిస్తూంటుంది. అయితే చనిపోయిన తల్లి తిరిగి రాదు కదా. కానీ వీళ్ల ముగ్గరు జీవితంలో మిరాకల్ జరుగుతుంది.  ఓ రోజు శ్రీను తో పాటు బయిటకు  వెళ్లిన ఆదికి సైంటిస్ట్ రంగి కుట్ట పాల్ (నాజర్) పరిచయం అవుతాడు.  అతను కనిపెట్టిన టైమ్ మిషన్ తో ఇరవై ఏళ్లు వెనక్కి పంపిస్తానని, తల్లితో మళ్లీ కలిసేలా చేస్తానని చెబుతాడు.  దాంతో ఈ ముగ్గురు మిత్రులు కలిసి టైమ్ మిషన్ సాయింతో గతంలోకి ప్రయాణిస్తారు. అయితే అక్కడ ఓ అనుకోని ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి... గతంలోకి వెళ్లిన వీళ్లు తిరిగి రాగలిగారా..చివరకు ఏం జరిగింది..ఆది తన తల్లిని కలుసుకున్నాడా....ఆమె చనిపోకుండా ఆపగలిగాడా...శ్రీను, చైతులు ఏమి సాధించారు.  అనేది మిగిలిన కథ.

Follow Us:
Download App:
  • android
  • ios