Asianet News TeluguAsianet News Telugu

శర్వా నెక్ట్స్ నాగ్ డైరక్టర్ తో ఖరారు

 ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తే.. అది శర్వాకు జస్ట్ ఓకే అనిపించింది.  తాజాగా శర్వా మరో యంగ్  డైరెక్టర్‌తో సినిమాను సెట్ చేసుకున్నారు.

Sharwanand next with Sriram Aditya for People Media Factory
Author
First Published Jan 23, 2023, 4:53 PM IST


శర్వానంద్ కెరీర్ ట్రాక్ ఈ మధ్యకాలంలో సరిగ్గా లేదు. ‘నేను శైలజ’ ఫేమ్  కిషోర్ తిరుమలతో అతను చేసిన ‘ఆడవాళ్ళు నీకు జోహార్లు’ తీవ్రంగా నిరాశ పరిచింది. దీని తర్వాత శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడిని నమ్మి ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తే.. అది శర్వాకు జస్ట్ ఓకే అనిపించింది. అంతేకానీ అవసరమైన హిట్ ఇవ్వలేకపోయింది. తాజాగా శర్వా మరో యంగ్  డైరెక్టర్‌తో సినిమాను సెట్ చేసుకున్నారు.

ఆ యంగ్ డైరక్టర్ మరెవరో కాదు.. శ్రీరామ్ ఆదిత్య. అతనితో శర్వానంద్ ఓ సినిమా చేయబోతున్నాడు. ‘భలే మంచి రోజు’తో ప్రామిసింగ్ డైరెక్టర్‌లా కనిపించిన శ్రీరామ్.. తర్వాత వరుసగా ఫ్లాపులు ఇస్తూ వస్తున్నాడు. శమంతకమణి, దేవదాసు, హీరో సినిమాలు అతన్ని పూర్తిగా వెనక్కి లాగేసాయి. అంతకుముందు రెండు చిత్రాలైనా ఓకే కానీ.. చివరగా శ్రీరామ్ తీసిన ‘హీరో’ ప్రేక్షకులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీని తర్వాత అతడికి ఇంకో ఛాన్స్ కష్టమనుకుంటున్న సమయంలో శర్వా అతడితో సినిమాను ఓకే చేశాడు. వీరి కలయికలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకోబోతోందట.ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా వారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రీసెంట్ గా లండన్ వెళ్లి లొకేషన్స్ సెర్చ్ చేసి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. 

 ఈ చిత్రంలో శర్వా సరసన ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి నటించనున్నట్లు సమాచారం. వీరి కలయికలో రానున్న తొలి చిత్రమిదే. స్వల్ప వ్యవధిలో వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదుర్కొన్న కృతికి శర్వా లాంటి పేరున్న హీరో పక్కన ఛాన్స్ రావడం విశేషమే అంటున్నారు.

ఇదిలా ఉంటే శర్వానంద్  "రౌడీ ఫెలో" సినిమాతో ఓకే అనిపించుకుని  ఆ తర్వాత "ఛల్ మోహన్ రంగ" తో ప్లాప్ అందుకున్న కృష్ణచైతన్యతో శర్వా  ఒక సినిమాను చేయబోతున్నారని వార్తలు వ్చచాయి. ఈ సినిమా ఈ షూటింగ్ ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ఆ సినిమా అప్డేట్స్ మళ్లీ వినపడలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios