కామెడీ సినిమాలతో తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు మారుతి గత ఏడాది శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ఓపెనింగ్స్ గట్టిగానే అందినా కూడా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. దీంతో నెక్స్ట్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. 

శైలజా రెడ్డి అల్లుడు తరువాత బన్నీతో ఒక స్క్రిప్ట్ అందుకున్న మారుతి తీరా సినిమా కథను పూర్తి చేసేసరికి బన్నీ మిస్ అయ్యాడు. త్రివిక్రమ్ చేస్తున్నట్లు అల్లు అర్జున్ నిర్ణయం తీసుకోవడంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో వర్క్ చేయడానికి ప్లాన్ వేయగా ఇప్పుడు విజయ్ డేట్స్ దొరకడం కష్టంగా మారింది. వరుసగా సినిమాలతో బిజీగా ఉండడంతో మరో ఏడాది వరకు విజయ్ కొత్త ప్రాజెక్టులను ఒకే చేసే అవకాశం లేదు. 

బన్నీ - విజయ్ దేవరకొండ ఇద్దరు కుదరకపోవడంతో ఫైనల్ గా శర్వానంద్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ కాంబోలో మహానుభావుడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి మారుతితో వర్క్ చేయడానికి శర్వా ఒప్పేసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో సుదీర్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు