రీసెంట్ గా రణరంగం సినిమాతో ఊహించని విధంగా ఫెయిల్యూర్ ని అందుకున్న యువ హీరో శర్వానంద్ నెక్స్ట్ 96 రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పుడు తమిళ్ ప్రొడక్షన్ హౌజ్ తో కలిసి శర్వా మరో సినిమాను మొదలుపెట్టాడు. చెన్నైలో న్యూప్రాజెక్ట్ ను లాంచ్ చేశారు. 

శ్రీ కార్తీక్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండగా పెళ్లి చూపులు ఫెమ్ తరుణ్ భాస్కర్ సినిమాకు మాటలు అందించాడు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక శర్వానంద్ సరసన తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్ గా నటించనుంది. రీసెంట్ గా సూర్య NGK సినిమాను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

'పడి పడి లేచే మనసు - రణరంగం సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ ని ఇవ్వకపోవడంతో శర్వా తదుపరి ప్రాజెక్టులపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 96 రీమేక్ షూటింగ్ లో పాల్గొంటూనే ఏ కొత్త సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.