రణరంగం సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్న యువ హీరో శర్వానంద్ నెక్స్ట్ సినిమాలతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ 96రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

ఇకపోతే రీసెంట్ గా కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి చెప్పిన కథకు శర్వా గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే ఈ కథలో శర్వానంద్ ఒక రైతుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ కథాంశంతో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. సినిమాలో ఎమోషన్స్ తో పాటు మంచి సందేశం కూడా ఉంటుందని టాక్. 

మొదట హైదరాబద్ లో ఒక షెడ్యూల్ ని స్టార్ట్ చేసి ఆ తరువాత అనంతపూర్ - తిరుపతి పరిసర గ్రామాల్లో సినిమా షూటింగ్ ని కొనసాగించనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ లో ఉన్నాయి. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పై రామ్ - గోపీ అచంట సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు.