శర్వానంద్‌ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. తాజాగా చిత్ర నిర్మాతలు నారాయ‌ణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్ట‌ర్‌, తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

 అయితే ఈ సినిమాకి దర్శకుడెవరనేది ఆసక్తికరంగా మారింది. `జాను` ఫెయిల్యూర్‌లో ఉన్నశర్వానంద్‌ ప్రస్తుతం `శ్రీకారం` చిత్రంలో నటిస్తున్నారు. కిశోర్‌ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా ఓ సినిమా చేయబోతున్నారు. రాజు సుందరంతోనూ ఆ మధ్య చర్చలు జరిగాయి. ఇది ఇంకా పెండింగ్‌లో ఉంది. అలాగే కిశోర్‌ తిరుమల డైరెక్షన్‌లోనూ సినిమాకి ప్లాన్‌ చేసినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో తెరకెక్కనుందని టాక్‌. 

ఇదిలా ఉంటే నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించబోయే సినిమాకి దర్శకుడెవరనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే తాజాగా సమాచారం మేరకు ఓ కొత్త డైరెక్టర్‌ని పరిచయం చేయబోతున్నారని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. బట్‌ ఇదొక డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో ఉంటుందని టాక్‌.