Asianet News TeluguAsianet News Telugu

శర్వానంద్ తో జతకట్టబోతున్న లక్కీ హీరోయిన్ కృతి శెట్టి..?

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ తో సినిమా రాబోతోంది. ఇప్పటి వరకూ   కనిపించని సరికొత్త జంట తెరపై సందడి చేయబోతోంది. శర్వానంద్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మరి ఆసినిమా డిటేయిల్స్ లోకి వెళ్తే...

Sharwanand Movie with Kriti Shetty
Author
First Published Nov 21, 2022, 8:39 PM IST

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ తో సినిమా రాబోతోంది. ఇప్పటి వరకూ   కనిపించని సరికొత్త జంట తెరపై సందడి చేయబోతోంది. శర్వానంద్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మరి ఆసినిమా డిటేయిల్స్ లోకి వెళ్తే...

రీసెంట్ గా ఒకే ఒక జీవితం సినిమాతో చాలా కాలం తరువాత మంచి హిటో అందుకున్నాడు. దాదాపు నాలుగైదు ప్లాప్ ల తరువాత        ఈ మూవీ శర్వానంద్ కు ఊరటనిచ్చింది. ఇక ఆతరువాత వరుస సినిమాలతో మెరుపులు మెరిపించాలని చూస్తున్నాడు యంగ్ హీరో. ఈక్రమంలోనే శర్వానంద్, భలే మంచి రోజు, శమంతకమణి, హీరో ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్‌లో ఓ సినిమాను చేయబోతున్నట్టు తెలస్తోంది. ఫ్యామిలీ కథతోపాటు ఫుల్ కామెడీ .. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. 

అయితే ఈమూవీకి సబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. ఈక్రమంలోనే ఈ మూవీలో శర్వానంద్ జోడీగా.. లక్కీ హీరోయిన్ కృతి శెట్టిని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెను ఇప్పటికే సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేదానిపై క్లారిటీ కనిపించడంలేదు. దాదాపు ఈసినిమాకు ఉప్పెన బ్యూటీ కన్ ఫార్మ్ అయినట్టే అంటున్నారు. 

ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. శర్వానంద్ జోడీగా కృతి శెట్టి పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాదు కృతి శెట్టి గ్లామర్ పార్ట్ కే పరిమితం కాకుండా.. ఈసినిమాలో మంచి పెర్ఫామెన్స్ రోల్ ను ఇస్తున్నట్టు తెలుస్తోంది. స్టోరీ హీరోయిన్ వల్లే టర్న్ తీసుకునే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈసినిమాకు టైటిల్ గురించి ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈసినిమాకు సబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్.. త్వరలో స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా  ఫోటోగ్రఫీకి సబంధించిన వర్క్  వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. సినిమాలో ఎక్కువ భాగం లండన్‌లో షూట్ చేయనుండగా, యూరప్‌లోని కొన్నిప్రాంతాల్లో కూడా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.  ఇక ఈమూవీలో ఇప్పటివరకూ ఆడియన్స్ చూడని కొత్త శర్వానంద్ ను చూపించబోతున్నట్టు సమాచారం. 


 

Follow Us:
Download App:
  • android
  • ios