హంగామా లేకుండా సినిమా మొదలెట్టాసారని,  ఆల్రెడీ షూటింగ్‌ కూడా హైదరాబాద్‌లో జరుగుతోందని తెలుస్తోంది. శర్వా-కృతి తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. 


ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఒకే ఒక జీవితం కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. తన కెరీర్ ని సక్సెస్ బాటలో పెడుతుందనుకుంటే అంత లేదని ఆ సినిమా హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఎలాగైనా హిట్ ట్రాక్‌ పడాలనుకున్నాడు. అందుకోసం మంచి కథలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నాడు. అందుకే కృష్ణ చైతన్య అనే దర్శకుడితో సినిమా లాక్ చేసుకుని ముందుకు వెళ్లాడు. ఆ తర్వాత ఘనంగా మూవీని కూడా ప్రారంభించాడు. అయితే ఎంతో ఘనంగా ప్రారంభించిన తర్వాత ఇప్పుడు శర్వానంద్ మనసు మారింది. కృష్ణ చైతన్య స్టోరీ విషయంలో కాన్పిడెంట్‌గా లేడు.దాంతో ఆ చిత్రాన్ని ప్రస్తుతం హోల్డ్‌లో ఉంచారట శర్వానంద్‌.

ఈ క్రమంలో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య రాసుకొచ్చిన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీరామ్ అంటే భలే మంచి రోజు, శమంతకమణి లాంటి చిత్రాలు తెరకెక్కించాడు. ఇందులో కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారని సమాచారం. అలాగే హంగామా లేకుండా సినిమా మొదలెట్టాసారని, ఆల్రెడీ షూటింగ్‌ కూడా హైదరాబాద్‌లో జరుగుతోందని తెలుస్తోంది. శర్వా-కృతి తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఈ సినిమాపై శర్వా బాగా నమ్మకంగా ఉన్నాడు. 

ఇక శర్వానంద్ గత కొద్ది వారాలుగా తన వ్యక్తిగత జీవితం వల్ల బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వానంద్ వివాహం ఈ మధ్యనే అంగరంగ వైభవంగా జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షిత మెడలో శర్వానంద్ త్వరలోనే మూడు ముళ్ళు వేసాడు.