యంగ్‌ హీరో శర్వానంద్‌ తన ఫ్యాన్స్ కి బర్త్ డే(మార్చి 6) ట్రీట్‌ ఇచ్చారు. ఒక్క రోజు ముందే(శుక్రవారం) తాను నటిస్తున్న `శ్రీకారం` ట్రైలర్‌ని విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తుంది. తాజాగా మరో సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో `మహాసముద్రం` చిత్రంలో నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఇందులో మరో హీరో. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని శర్వానంద్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో శర్వానంద్‌ మాస్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి మాస్‌ లుక్‌లో శర్వానంద్‌ ఎప్పుడూ కనిపించలేదు. చేతిలో ఇనుప ఆయుధం పట్టుకుని కోపంగా ఉన్నాడు శర్వానంద్‌. ఆయుధం నుంచి రక్తం కారుతుంది. శర్వా ముఖంలో కోసం, ఆవేశం కలగలిపి ఉన్నాయి. వెనకాల బీచ్‌లో ఇసుక తిన్నెలు, పడవలు, సముద్రం, దూరంగా ఇళ్లు ఉన్నాయి. తాజా లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

మరోవైపు శర్వానంద్‌ బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా బర్త్ డే సీడీపీని విడుదల చేశారు. ఇందులో శర్వా సినిమాల్లోని గెటప్‌లు, వెనకాలు ఆయన సినిమా  పోస్టర్లున్నాయి. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. దీంతోపాటు శర్వానంద్‌ కొత్త సినిమాని ప్రకటించారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమాని ప్రకటించారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ కాసేపట్లో రానుంది.