యువ హీరో శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం పడిపడి లేచే మనసు. ఈ క్యూట్ లవ్ స్టోరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సినిమాకు డిఫరెంట్ జానర్ లో వస్తోన్న అంతరిక్షం సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే వరుణ్ వర్సెస్ శర్వా ఫైట్ అంటూ వస్తోన్న టాక్ పై శర్వానంద్ స్పందించాడు. 

సినిమా ఇండస్ట్రీలో ఎవరి స్పెస్ వారికి ఉంటుంది. అందుకే ఎవరికీ ఎవరు పోటీ కాదు. అందరి సినిమాలు బాగా ఆడాలి. అలాగే తమ్ముడు వరుణ్ తేజ్ చిత్రం అంతరిక్షం కూడా అందరికి నచ్చి బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శర్వానంద్ కూల్ గా క్లారిటీ ఇచ్చాడు. ఇక పడి పడి లేచే మనసు అన్ని వర్గాలకు నచ్చే సినిమా అని తన లవ్ గురించి కూడా చెప్పాడు. 

గతంలో ఒక ఇంటర్వ్యూలో లవ్ లో ఉన్నారా అనే ప్రశ్నకు.. ఉన్నాను అని చెప్పిన శర్వానంద్.. అప్పుడు ఉన్నట్లు చెప్పా అంటూ.. ఇప్పుడు ఎవరు లేరు.. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను అంటూ మ్యాటర్ ఫినిష్ చేశాడు. మరి ఆ లక్కీ గర్ల్ గురించి శర్వా ఎప్పుడు బయటపెడతాడో చూడాలి.