శర్వానంద్‌ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.  ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌ కథానాయికలు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో యంగ్‌స్టర్‌గా, మిడిల్‌ ఏజ్డ్‌ గ్యాంగ్‌స్టర్‌గా శర్వా డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారని టాక్‌.  గ్యాంగ్‌స్టర్‌ రోల్‌ కోసం గుబురు గడ్డంతో శర్వా అల్ట్రా స్టైలిష్‌గా కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు గతంలో లీక్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయనున్నారు.

అయితే ఈ సినిమా టైటిల్ ఏంటనే విషయం బయటకి పొక్కింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'రణరంగం' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే  టైటిల్ తో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయనున్నారు.

టైటిల్ కి తగ్గట్లే సినిమాలో శర్వా క్యారెక్టర్ ని ఎంతో పవర్ ఫుల్ గా చూపించాబోతున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.