ఫిదా సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఆడియెన్స్ ని తనవైపుకు తిప్పుకుంది సాయి పల్లవి. అయితే ఆమెపై ఎవరు ఊహించని విధంగా గతంలో కొన్ని రూమర్స్ వినిపించాయి. అయితే శర్వానంద్ సాయి పల్లవికి మద్దతుగా నిలిచి ఆ రూమర్స్ కి చెక్ పెట్టె ప్రయత్నం చేశాడు. శర్వా సాయి పల్లవితో పడి పడి లేచే మనసు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 

అయితే అమ్మడిపై గతంలోనే షూటింగ్ లకు లేటుగా వచ్చినట్లు రూమర్స్ వచ్చాయి. అలాగే రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం వంటి కథనాలు కూడా వచ్చాయి. రీసెంట్ గా పడి పడి లేచే మనసు రీ షూట్ కోసం సాయి పల్లవి ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు మీడియాలో గాసిప్స్ వచ్చాయి. వాటన్నిటికీ కౌంటర్ ఇచ్చే విధంగా శర్వా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చాడు. 

అందరిలోకెల్లా సాయి పల్లవి మోస్ట్ డేడికేటెడ్ నటి అంటూ మనసు పెట్టి సినిమాలో నటిస్తుందని ఆమెకు మంచి ఫ్యూచర్ ఉందని మంచి యాక్టర్ అంటూ ఆకాశానికెత్తేశాడు. దీంతో సాయి పల్లవి పై వస్తోన్న రూమర్స్ అబ్బద్దమని కుర్రహీరో చెప్పకనే చెప్పేసి ఇన్ డైరెక్ట్ క్లారిటీ ఇచ్చాడని చెప్పవచ్చు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.