టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి ఎప్పుడైతే వరల్డ్ లెవెల్లో ఒక బ్రాండ్ సెట్ చేసుకుందో అప్పటి నుంచి నార్త్ హీరోలు ఎలాగైనా బాహుబలిని మించేలా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్లు వారి మాటల్లోనే తెలుస్తోంది. ఒకవైపు టాలీవుడ్ ని పొగుడుతున్నప్పటికి బాలీవుడ్ నుంచి బాహుబలిని ఢీకొట్టే సినిమాను దింపాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఇక అమీర్ ఖాన్ మహాభారతం అంటూ నిన్న మొన్న బాగా హాల్ చల్ చేశాడు. కానీ వాటి నిర్మాణ పనులు ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేదు. వెబ్ సిరీస్ తరహాలో 1000 కోట్లతో ప్లాన్ చేయాలని ముఖేష్ అంబానితో చర్చలు కూడా జరిగాయని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. కానీ అదే తరహాలో అమీర్ మళ్ళీ తన ఆలోచనని విరమించుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. దీంతో మహాభారతం ఇప్పట్లో లేనట్లే అనే భావన అందరిలో కలుగుతోంది.

ఈ తరుణంలో షారుక్ ఊహించని కామెంట్ తో మళ్ళీ సినీ ప్రేమికుల్లో ఆశలు నింపాడు. ఇటివల ఇచ్చిన ఇంటర్వ్యూలో మహాభారతంలో కృష్ణుడి పాత్ర అమీర్ ఖాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ తనకు అవకాశం ఇస్తే మొదట అదే పాత్రను ఎంచుకుంటాను అని చెప్పాడు. అయితే అమీర్ ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు నాకు చాన్స్ లేదని షారుక్ వివరణ ఇచ్చాడంతో మహాభారతం క్యాన్సిల్ అవ్వలేదని తెలుస్తోంది.  మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో..?