షాక్: షారూఖ్ ‘డంకీ’..ఆ చిత్రం రీమేకా?
మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టే వారిని ఉద్దేశించి ఈ సినిమా ఉంటుంది. అలా వెళ్లే దారులను డాంకీ రోడ్స్ అంటారు. అంటే గాడిద వెళ్లే రహదారులు అని ..కాబట్టి టైటిల్ కూడా డంకీ అని పెట్టారంటున్నారు.

కొన్నాళ్లు కెరీర్ పరంగా పూర్తిగా వెనకబడ్డ షారుఖ్‌ఖాన్ ఇప్పుడు అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. ‘పఠాన్’, ‘జవాన్’ల రూపంలో రెండు సూపర్ డూపర్ హిట్లుకొట్టాడు. ‘పఠాన్’తో తన పాత ప్లాఫ్ ల వరసను వదిలేసి కొత్త రికార్డుల్ని సృష్టించిన షారుఖ్... ‘జవాన్’తో ఆ రికార్డుల్ని తానే తిరగరాశాడు. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయన తాజా చిత్రం ‘డంకీ’పై పడింది. షారుఖ్ - రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం కావంటతో దేశవ్యాప్తంగా అంతటా ఆసక్తి నెలకొని ఉంది. దానికి తోడు రాజ్‌కుమార్ హీరాణీ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటం కలిసొచ్చే విషయం. ఈ సినిమా కోసం ఇండియన్ బాక్సాఫీస్ ఆసక్తిగా ఎదురు చూస్తోందనటంలో అతియోశక్తి లేదు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రం ఓ పంజాబీ చిత్రం రీమేక్ అనే వార్త బయిటకు వచ్చింది. అయితే అఫీషియల్ రీమేక్ లేదా కేవలం స్టోరీ లైన్ సిమిలర్ గా ఉందని ప్రచారం జరుగుతోందా అనేది తెలియాల్సి ఉంది.
ఆ చిత్రం మరోదో కాదు... 2022 లో వచ్చిన Aaaja Mexico Challiye సినిమా. ఈ సినిమా పంజాబ్ లో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కథలాంటిదే డంకీ కథ కూడాను. దాంతో ఆ చిత్రం అఫీషియల్ రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. మన దేశంలో అమెరికా వెళ్లాలని కలలు కనేవాళ్లు ప్రపంచం నలుమూలలా కనిపిస్తారు. ఆ క్రమంలో ప్రాణాలకు తెగించి మరీ ప్రయాణాలు చేసేవారి కథలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించే వారు జైళ్లలో మగ్గుతున్న ఉదంతాలు ప్రతి రోజూ కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి కథల్లో ఇది ఒకటి అని తెలుస్తోంది.
మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టే వారిని ఉద్దేశించి ఈ సినిమా ఉంటుంది. అలా వెళ్లే దారులను డాంకీ రోడ్స్ అంటారు. అంటే గాడిద వెళ్లే రహదారులు అని ..కాబట్టి టైటిల్ కూడా డంకీ అని పెట్టారంటున్నారు.అక్టోబరు 2021 నుంచి సెప్టెంబరు 2022 వరకు మెక్సికో సరిహద్దు దగ్గర 16,290 మంది భారతీయులను అమెరికన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా ప్రతీ ఏడూ జరుగుతూనే ఉంటోంది.2019లో ఆరేళ్ళ పంజాబీ అమ్మాయి అరిజోనా ఎడారిలో మరణించినప్పుడు ఈ ప్రయాణంలో పొంచి ఉన్న ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం మన దేశంలో ఉన్న అన్ని ప్రధాన పత్రికలలోనూ వచ్చింది.
ఇక ట్రైడ్ విషయానికి వస్తే...మొదట అనుకున్న డిసెంబరు 22న ఈ సినిమా రావాల్సింది. అదే రోజున ప్రభాస్ నటించిన ‘సలార్’ విడుదల కానుంది. ‘సలార్’ వల్ల ‘డంకీ’ విడుదల వాయిదా పడుతుందని అంతా ఊహించారు. అయితే చిత్రబృందం మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. ఒక రోజు ముందే.. ‘డంకీ’ని విడుదల చేయబోతోంది. డిసెంబరు 21న ‘డంకీ’ విడుదల కానుంది. ఈమేరకు డిస్టిబ్యూటర్లకు చిత్ర టీమ్ పోస్టర్ వదిలింది. ఒకే రోజు రెండు సినిమాలొస్తే.. థియేటర్ల పంపకం కష్టం అవుతుంది. ఒకరోజు గ్యాప్ తీసుకొన్నా... ఆ ఇబ్బందిని అధిగమించవచ్చు. అందుకే ‘డంకీ’ ఒకరోజు ముందే విడుదలకు సిద్ధమైంది.