శాన్వి శ్రీవాత్సవ గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు బాగా తెలిసే ఉంటుంది. పెద్దగా హిట్స్ అందుకోకపోయినప్పటికి అమ్మడు అప్పట్లో చేసిన కొన్ని సినిమాలు బాగానే క్లిక్కయ్యాయి. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా బేబీ యువతని తన అందంతో బాగానే ఎట్రాక్ట్ చేసింది. 

ఇక ఇప్పుడు బికినీ లుక్స్ తో ఇంటర్నెట్ ని మరింత షేక్ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా శాన్వి ఇచ్చిన ఈ స్టిల్స్ కి ఆమె ఫాలోవర్స్ షాకవుతున్నారు. లవ్లీ - అడ్డా వంటి సినిమాల్లో కనిపించిన శాన్వి ఇలా దర్శనమివ్వడంతో తెలుగు జనాలకైతే నమ్మబుద్ది కావడం లేదు. 

ఏది ఏమైనా అమ్మడు కెరీర్ పై స్ట్రాంగ్ గా ద్రుష్టి పెట్టింది. అన్ని తరహా పాత్రల్లో మెప్పించాలని ఇలా గ్లామర్ డోస్ కూడా పెంచేస్తోంది. ప్రస్తుతం కన్నడలో మంచి అవకాశాలను అందుకుంటున్న అమ్మడు మలయాళం - కోలీవుడ్ లలో కూడా చిన్న సినిమాలు చేస్తోంది.