శుక్రవారం ఎపిసోడ్(103వ రోజు)లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఊహించిన విధంగా పెద్ద షాక్ ఇచ్చాడు. ఏకంగా సిరిని ఎలిమినేట్ చేశాడు. ఇది హౌజ్‌మేట్స్ అందరికి పెద్ద షాక్ అని చెప్పొచ్చు.
బిగ్‌బాస్ ఐదో సీజన్(Bigg Boss Telugu 5) చివరి వారంలో సరికొత్త మలుపు చోటు చేసుకుంది. గురువారం ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ టాస్క్ లు, గేమ్‌లతో నవ్వులు పూయించారు. సిరి, సన్నీ మధ్య వార్‌తో హీటు పెంచింది. ఇక శుక్రవారం ఎపిసోడ్(103వ రోజు)లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఊహించిన విధంగా పెద్ద షాక్ ఇచ్చాడు. ఏకంగా సిరి(Siri)ని ఎలిమినేట్ చేశాడు. ఇది హౌజ్‌మేట్స్ అందరికి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్.
ఇక శుక్రవారం ఎపిసోడ్‌లో మొదట కార్డ్స్ చూసి జాతకాలు చెప్పే లేడీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఫైనలిస్ట్ లైనా సన్నీ, మానస్, శ్రీరామ్,సిరి, షణ్ముఖ్‌ల గురించి చెప్పింది. సన్నీ ఎంపరర్ అని, ఆయన లైఫ్ ఈ షోతో కొత్తగా బిగిన్ అవుతుందని తెలిపింది. మరోవైపు ఆయన జీవితంలో లవ్ ఉందని, కాకపోతే కెరీర్ ముందు, ఆ తర్వాతే ప్రేమ అని తెలిపింది. ఎందులోనైనా విన్నర్ అని చెప్పింది. మానస్ అన్ని చూశాడని, కామ్ గోయింగ్ గాయ్ అని తెలిపారు. శ్రీరామ్ లవ్ లైఫ్ బాగుంటుందని తెలిపింది. జీవితంలో అమ్మాయి ఉందని తెలిపింది.
సిరికి హౌజ్ నుంచి బయటకు వెళ్లాక పెళ్లి విషయాలు చర్చకు వస్తాయని, మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక షణ్ముఖ్ హౌజ్ నుంచి బయటకు వెళ్లాక లైఫ్‌లో అన్నీ బాగా జరుగుతాయని, విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉందని, ఆయన ఆర్థికంగానూ నిలదొక్కుకుంటాడని చెప్పింది. లవ్ లైఫ్‌కూడా బాగుంటుందని, అన్ని మంచిరోజులొచ్చాయని చెప్పింది. అయితే ఓ నేషనల్ టెలివిజన్‌లో ఇలాంటి జాతకాలు, కార్డ్ లు చూపించడం, వారిజాతకాలు చెప్పించడం వంటి అంశాలను ఎంకరేజ్ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సైంటిఫికల్‌గా ఏదైనా అవగాహన కల్పించాల్సింది పోయి ఇలా కార్డులను బట్టి వారి జీవితాలను నిర్ణయించేలా జాతకాలు చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బిగ్‌బాస్ ప్రియులు. ఇది పెద్ద బ్లండర్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక హౌజ్‌లో ఈ కార్డులతో కూడిన జాతకాల సెషన్ పూర్తయిన తర్వాత ఫుడ్ విషయంలో సిరికి, షణ్ముఖ్‌కి మధ్య వివాదం రాజుకుంది. సిరి మార్నింగ్ దోశలు చేస్తే అవి తినలేదని, అలానే ఉంచారని సిరికి చెబుతాడు షణ్ముఖ్. అయితే తాను చేశాను, కానీ ఆ తర్వాత తిన్నారో లేదో తెలియదని, తాను చూడలేదని తెలిపింది. ఏం తెలుస్తుంది, ఏం తెలియదు, చూసుకోవాలి కదా, చెబితే వినాలి కదా అంటూ మండిపడ్డాడు షణ్ముఖ్. దీంతో సిరి, షణ్ముఖ్ మధ్య మరోసారి రచ్చ జరిగింది. అయితే మానస్ ఓ స్వీట్ దోశ తిన్నానని చెప్పగా, తనని అడగలేదని సన్నీ సరిపెట్టుకున్నాడు.
అనంతరం పెద్ద షాకిచ్చాడు బిగ్‌బాస్. గ్రాండ్ ఫినాలే కంటే ముందు ఒకరి ప్రయాణం ఈ రోజుతో పూర్తయ్యిందని, హౌజ్ నుంచి వెళ్లిపోయే టైమ్ వచ్చిందని, అది ఎవరో నిర్ణయించుకోవాలని సభ్యులకు తెలిపారు. ఇందులో ఒక్కొక్కరు ఒకరి పేరుని సూచించారు. మానస్.. షణ్ముఖ్ పేరుని చెప్పగా, షణ్ముఖ్ సన్నీ పేరుని, సిరి, మానస్ పేరుని, శ్రీరామ్ సిరి పేరుని, సన్నీ, షణ్ముఖ్ పేరుని సూచించారు. అయితే బిగ్‌బాస్ మాత్రం సిరిని హౌజ్ నుంచి వెళ్లిపోవాలని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు ఏకంగా సిరిని హౌజ్‌నుంచి పంపిం చేశాడు. అయితే ఆమె వెళ్లిపోవడంలో ఏదో ట్విస్ట్ ఉంటుందని అంతా భావించారు. కానీ షణ్ముఖ్, సిరిలు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నారు. సిరి వెళ్లిపోతుంటే గేట్ వద్దే కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు షణ్ముఖ్. కొద్దిసేపు సిరిని సీక్రెట్ రూమ్‌లో ఉంచి, ఆ తర్వాత హౌజ్‌లోకి పంపించారు.
దీంతో సిరి చాలా హ్యాపీ, అలాగే షణ్ముఖ్ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. వీరిద్దరు బ్యాక్ టూ బ్యాక్ హగ్‌లతో రెచ్చిపోయారు. హద్దులు మీరిన హగ్గులతో రెచ్చిపోవడం విశేషం. ఈ ఇద్దరు గాఢప్రేమికుల మాదిరిగా ఒకరికోసం ఒకరు చలించిపోవడం, ముఖ్యంగా సిరి కోసం షన్ను తల్లడిల్లిపోయిన విధానం, కన్నీళ్లు పెట్టుకోవడం, షన్ను కోసం వెళ్లిపోతాను అని సిరి చెప్పడం వీరిద్దరి మధ్య స్నేహంపై అనుమానాలు క్రియేట్ చేస్తుంది.
ఆ తర్వాత సిరి శ్రీరామ్‌కి ఝలక్ ఇచ్చింది. `ఇప్పుడు చెప్పడ్రా అబ్బాయిలు వాట్ డూ వాట్ నాట్ డూ ` అంటూ `విక్రమార్కుడు` చిత్రంలోని జింతాక జింతాక జింతాక తా.. అంటూ శ్రీరామ్‌కి చెప్పడం నవ్వులు పూయించింది. దీంతో శుక్రవారం ఎపిసోడ్ పూర్తయ్యింది. రేపు శనివారం ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ 1,2, 3, 4, టాప్ 5 కంటెస్టెంట్లు వచ్చి హౌజ్‌మెట్స్ తో మాట్లాడటం సరదాసరదాగా సాగుతుందని ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది.
