2.0 చిత్రం శంకర్ భారతీయుడు 2 తెరకెక్కించాలనుకున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఆ చిత్రం ఆగిపోయినట్లే కనిపిస్తోంది. నిర్మాతలు హ్యాండివ్వడంతో శంకర్ మరో చిత్రంపై దృష్టిపెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోల వారసులతో శంకర్ ఈ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

శంకర్ ఇద్దరు క్రేజీ హీరోల కుమారులపై కన్నేశాడట. విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్, ఇళయదళపతి విజయ్ తనయుడు జేసన్ హీరోలుగా శంకర్ ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. శంకర్ కుర్ర హీరోలతో సినిమాలు చేయడం చాలా అరుదు. 

గతంలో సిద్ధార్థ్ హీరోగా శంకర్ బాయ్స్ అనే చిత్రాన్ని రూపొందించారు. శంకర్ సినిమాల్లో వినోదంతో పాటు దేశభక్తికి సంబంధించిన సందేశం కూడా ఉంటుంది. ధృవ్, జేసన్ లతో శంకర్ ఎలాంటి చిత్రాన్ని రూపొందిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.