Ramcharan - Shankar Movie: రామ్ చరణ్ పాట కోసం 25కోట్లు ఖర్చు.. ? శంకర్ ను దిల్ రాజు తట్టుకోగలడా..?

శంకర్ తో సినిమా అంటే.. వదల కోట్లతో వ్యవహారం. మరి గ్యారెంటీ ఉంటుందా అంటే.. చెప్పలేం. అయితే సూపర్ హిట్టు.. లేకపోతే డిజాస్టర్.  ఇక ఇప్పుడు  రామ్ చరణ్(Ramcharan) విషయంలో కూడా భారీ  ప్లానింగ్స్  వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దిల్ రాజు శంకర్ ను తట్టుకోగలడా..?

Shankar Spends 25 Crores On Ramcharan Special Song

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో రామ్ చరణ్(Ramcharan) మూవీకి చిన్న గ్యాప్ వచ్చింది. కరోన , భారతీయుడు2 షూటింగ్ పనులు కారణంగా శంకర్ చిన్న గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. శంకర్ సినిమా అంటేనే కోట్లతో వ్యావహారం. ఆయన చిన్న బిట్ కోసం కోట్లలో ఖర్చు చేయించిన సందర్భాలు ఉన్నాయి. యాక్షన్స్ సీక్వెన్స్ లకు గ్రాఫిక్స్ కోసం కోట్లు కుమ్మరిస్తాడు స్టార్  డైరెక్టర్. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమా విషయంలో కూడా అదే రిపిట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

కియారా అద్వాని(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఒకే ఒక్కడు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారని టాక్. కాని మూవీ టీమ్ ఈ విషయంలో ఏం మాట్లాడటం లేదు. అయితే సినిమా మాత్రం మొత్తంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది అని మాత్రం చెప్పారు. దాంతో పక్కాగా ఒకే ఒక్కడు సీక్వెల్ అని అర్ధం అవుతుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు సంబంధించిన ఒక్క పాట కోసం 25 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వనిపిస్తున్నాయి. ఈ సాంగ్ ను చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. సినిమా మొత్తాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండే ఈ సాంగ్ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్టు సమాచారం.

అంతే కాదు ఈమూవీలో భారీగా యాక్షన్ సీక్వెన్స్ లు కూడా  చేయబోతున్నట్టు తెలుస్తోంది. శంకర్ మార్క్ యాక్షన్ సీన్స్ అంటే ఎలా ఉంటాయో తెలిసిందే. దాని కోసం ప్రత్యేకంగా 70 కోట్ల వరకూ బడ్జెట్ ను కేటాయించబోతున్నట్టు సమాచారం. భారీ ఛేజింగ్ లు.. రామ్ చరణ్(Ram Charan) ఎలివేషన్ సీన్స్ కోసం కోట్లు ఖర్చు  చేయనున్నట్టు తెలుసోతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ కోసం ఇంత ఖర్చు చేయబుతన్నట్టు సమాచరాం. దీని కోసం స్పెషల్ ప్లానింగ్ కూడా రూపొందిస్తున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ టాక్.

అయితే  ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఆయన  25 కోట్లతో ఒక్క సినిమా చేస్తారు.  70 కోట్లు అంటే భారీ బడ్జెట్ సినిమా చేసి చూపిస్తాడు. అటువంటిది శంకర్ సినిమాకోసం ఒక్క పాటకు 25 కోట్లు పెట్టడం.. యాక్షన్ సీక్వెన్స్ ల కోసం 70 కోట్లు అంటే.. సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారు..? అని గులగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల బడ్జెట్ అనుకున్నట్టు తెలుస్తోంది. కాని శంకర్ తో సినమా అంటే మరికొన్ని కొట్ల అలా పక్కకు వేసుకోవల్సిందే.

సినిమా కంప్లీట్ అయ్యే సరికి.. 250 కోట్ల బడ్జెట్ అనకుంటే.. ఎలాగైనా మరో 50 కోట్లు ఎక్కువే అవుతుంది కాని.. తక్కువ కానివ్వడు స్టార్ డైరెక్టర్. అందుకే ఈ సినిమాకు దాదాపు 300 కోట్లు బడ్జెట్ అవుతందని ఇండస్ట్రీలో టాక్. దిల్ రాజు(Dil Raju)  కెరీర్ లో ఇదే అతి భారీ బడ్జెట్ సినిమా. మరి ఈ సినిమాను ఏ ధైర్యంతో స్టార్ట్ చేశారో తెలియదు కాని.. ఆయన ఖాతాలో విజయ్- వంశీ పైడిపల్లి లాంటి రేర్ కాంబినేషన్ మూవీస్  మరికొన్ని కూడా ఉన్నాయి.

కియార అద్వాని((Kiara Advani) ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి స్పెషల్ ఫోస్టర్ ను మొదట్లోనే రిలీజ్ చేశారు. అయితే దీని కోసమే ఏకంగా కోటి  70 లక్షల వరకూ ఖర్చు చేశారని టాక్ గట్టిగా నడిచింది. జయరామ్, అంజలీ, శ్రీకాంత్ లాంటిస్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.

గతంలో సింగిల్ సినిమాకు కూడా 70 కోట్లు పెట్టలేదు దిల్ రాజు(Dil Raju) మరి ఈసినిమాలో ఏకంగా.. యాక్షన్ సీక్వన్స్ కోసమే 70 కోట్లు పెడుతున్నారు అని టాక్ బయటకు రావడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు ఆడియన్స్. దిల్ రాజు ఇంత దైర్యం ఎలా చేయగలుగుతున్నాడు అంటూ.. కొంత మంది ట్రోల్ చేస్తున్నారు. అసలు శంకర్ ను నమ్మి ఇంత బడ్జెట్ ఎలా పెట్టగలుగుతున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నట్టు టాక్.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios