వరుస అపజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పినప్పటికీ ఆయన సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. కానీ అది నిజం కాదని షారుక్ సన్నిహిత సినీ ప్రముఖులు కొట్టిపారేశారు. 

ఇకపోతే షారుక్ ఖాన్ తో ఒక సినిమా చేయాలనీ దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అప్పట్లో ఒకే ఒక్కడు సినిమా షారుక్ తో హిందీలో రీమేక్ చేయాలని అనుకోగా వర్కౌట్ కాలేదు. ఇన్నేళ్ళలో ఎప్పుడు ఖాళీగా దొరకని షారుక్ ఇప్పుడు సినిమాలను దూరం పెట్టడంతో శంకర్ ఆ ఛాన్స్ ని ఉపయోగించుకుంటున్నాడు. సముద్రం నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా శంకర్ ఒక స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

షారుక్ తో కొన్ని పాయింట్లు చెప్పి డిస్కస్ చేయగా పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. ఆ సినిమాకు దాదాపు 300కోట్లకు పైగా ఖర్చవుతుందని ఇన్ సైడ్ టాక్. కానీ 2.0 తరువాత శంకర్ పై నమ్మకం ఉంచి ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టాలంటే ఏ నిర్మాత ధైర్యం చేయడం లేదు. అందుకే భారతీయుడు 2తో సక్సెస్ అందుకొని తన రేంజ్ ని పెంచుకోవాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. షారుక్ కూడా కమల్ సినిమా అయిపోయిన తరువాత డిస్కస్ చేద్దామని అప్పటివరకు తాను వెయిట్ చేస్తానని షారుఖ్ వివరణ ఇచ్చినట్లు స్;సమాచారం.