Asianet News TeluguAsianet News Telugu

శంకర్‌-చరణ్‌ మూవీ లాంచ్ పోస్ట్ పోన్‌.. రాజమౌళి ఇంకా వదిలేలా లేదుగా!

 ‘జెంటిల్‌మెన్‌’తో కెరీర్‌ను ప్రారంభించిన శంకర్‌ దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్‌చరణ్‌తో తీస్తున్న సినిమా శంకర్‌కు 15వ సినిమా కావడం విశేషం. అలాగే ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌కు కూడా ఇది 15వ చిత్రమవడం గమనార్హం.

Shankar Ram Charans film launch postponed
Author
Hyderabad, First Published Aug 25, 2021, 7:13 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచింగ్ ఈ చిత్రం టీమ్ మొత్తం రెడీ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆర్టిస్ట్‌లు నటించబోతున్నారు. సెప్టెంబర్ 8 న ఈ చిత్రం లాంచింగ్ డేట్ గా అనుకున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు లాంచింగ్ వాయిదా పడింది. అందుకు కారణం రామ్ చరణ్ కు గ్యాప్ లేనంత బిజీ షెడ్యూల్ ఉండటమే. 

రాజమౌళి ఇప్పట్లో వదిలేలా లేదు. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి రామ్ చరణ్ డేట్స్ మరో 20 రోజులు అవసరం అయ్యాయి. ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. అలాగే కొరటాల శివ డైరక్షన్ లో రూపొందుతున్న ఆచార్య చిత్రానికి రామ్ చరణ్ క్యారక్టర్ కు ఇంకా కొద్ది రోజులు షూట్ మిగిలి ఉంది. ఇవన్నీ బేరేజ్ వేసుకున్న శంకర్ ...ఓ నెలపాటు అంటే సెప్టెంబర్ చివరి దాకా రెగ్యులర్ షూట్ ని వాయిదా వేసారు. 

అలాగే కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించనుందని ప్రకటించారు. కియారా అద్వానీ గతంలో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించి తన అందచందాలతో అదరగొట్టింది. ఇక పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.  

ఇక శంకర్‌ అంటేనే భారీతనానికి పెట్టింది పేరు. అదే సమయంలో చరణ్‌కు మాస్‌లో మంచి ఇమేజ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని శంకర్‌ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పొలిటికల్‌ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందని ఓ టాక్‌. గతంలో ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఇందులో చరణ్‌ పాత్ర ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐఏఎస్‌ అధికారి సీఎం అయితే, సమాజంలో ఎలాంటి మార్పు తెచ్చాడన్న స్టోరీ లైన్ తో కథ సాగుతుందట.ఇవేమీ కాదు మెడికల్‌ మాఫియా నేపథ్యంలో ఈ కథ ఉంటుందని మరో టాక్‌. మరి మెగా హీరోను.. ఈ మెగా డైరెక్టర్‌ ఎలా చూపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios