`గేమ్ ఛేంజర్`, `ఇండియన్ 2` సీక్వెల్స్ కి శంకర్ ప్లాన్.. క్లారిటి ఇదే!
భారీ చిత్రాల దర్శకుడు ఇప్పుడు ఏక కాలంలో `గేమ్ ఛేంజర్`, `ఇండియన్ 2` చిత్రాలు రూపొందిస్తున్నారు. అయితే వీటికి సీక్వెల్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతుంది.
శంకర్ ప్రస్తుతం ఏక కాలంలో రెండు సినిమాలను రూపొందిస్తున్నారు. ఓ వైపు చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న `ఇండియన్ 2`ని పూర్తి చేశాడు. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుని డబ్బింగ్ వర్క్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాజల్, సిద్ధార్థ్, రకుల్ వంటి వారు ఇందులో నటిస్తున్నారు.
దీంతోపాటు శంకర్.. తెలుగులో రామ్‌చరణ్ హీరోగా `గేమ్ ఛేంజర్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా కూడా చాలా డిలేతో చిత్రీకరణ జరుగుతుంది. షెడ్యూల్ షెడ్యూల్‌కి చాలా గ్యాప్ వస్తుంది. శంకర్ అటు `ఇండియన్ 2` షూటింగ్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో `గేమ్ ఛేంజర్` కి బ్రేకులు పడుతున్నాయి. అయితే ఇప్పుడు కంటిన్యూగా ఈ చిత్రంపైనే ఫోకస్ పెట్టబోతున్నారు శంకర్.
ఇదిలా ఉంటే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. `గేమ్ ఛేంజర్` రెండు భాగాలుగా, అలాగే `ఇండియన్ 2`కి మరో సీక్వెల్ ఉంటుందనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం క్లారిటీ వార్త వినిపిస్తుంది. అనుకున్నట్టుగా, ప్రచారం జరుగుతున్నట్టుగా `గేమ్ ఛేంజర్`కి రెండు భాగాలుగా రాబోతుందనే వార్తలో నిజం లేదని తెలుస్తుంది. అది పూర్తిగా రూమర్ మాత్రమే అని సమాచారం.
అయితే `ఇండియన్ 2`కి మాత్రం సీక్వెల్ ఉంటుందట. సీక్వెల్‌కి లీడ్ వదిలేలా కథ ఎండ్ అవుతుందని, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, సమకాలీన అంశాల నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. అయితే శంకర్ నెక్ట్స్ సినిమా `ఇండియన్ 3`నా లేక, కొంత గ్యాప్‌తో ఈ సీక్వెల్‌ని రూపొందిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక రామ్‌చరణ్ హీరోగా పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న `గేమ్ ఛేంజర్`లో కీయారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. సీఎంగా, ఐఏఎస్ ఆఫీసర్‌గా ఆయన మెస్మరైజ్ చేయబోతున్నారట.