ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలను ఒక తమిళ్ సినిమాతో తిరగరాయగల సత్తా ఉన్న దర్శకుడిగా శంకర్ తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ ఐ - 2.ఓ సినిమాల తరువాత దేశం మెచ్చిన దర్శకుడు ఏ పని చేసినా అభిమానులకు నిరాశే కలుగుతోంది. తన సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే శంకర్ ఇప్పుడు ఆ పట్టు కోల్పోతున్నాడు. 

రీసెంట్ గా ఇండియన్ 2కి సంబందించిన స్పెషల్ పోస్టర్ తో పాటు చిన్న డైలాగ్ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నట్లు కోలీవుడ్ లో టాక్ వచ్చింది. అనుకున్నట్టుగానే పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఒక చిన్న క్లిప్ కూడా వదల్లేదు. పోనీ పోస్టర్ అయినా కొత్తగా ఉందా అంటే శంకర్ - కమల్ ల రేంజ్ కి తగ్గట్టుగా లేదు. 

సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి కమల్ హాసన్ కి సంబందించిన అదే లుక్ ని   వదులుతున్నారు గాని సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా విడుదల చేయడం లేదు.. దీంతో ఇంకా ఎన్ని రోజులు శంకర్ ఇలా నీరాశపరుస్తాడు అని కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. మరి నెక్స్ట్ పోస్టర్ తో అయినా ఈ స్టార్ డైరక్టర్ మెప్పిస్తాడో లేదో?