మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిత్రాల లైనప్ ఆసక్తికరంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం రాంచరణ్ మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిత్రాల లైనప్ ఆసక్తికరంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం రాంచరణ్ మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ తొలిసారి నటిస్తున్నాడు. 

చక్కటి సందేశం, మాస్ ఎలిమెంట్స్ కలిపి శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శంకర్, రాంచరణ్ తొలి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో మరో షెడ్యూల్ కి రెడీ అవుతోంది. 

ప్రస్తుతం దర్శకుడు శంకర్ అండ్ టీం లొకేషన్స్ వేటలో ఉన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా దోసకాయల పల్లి గ్రామంలో ఈ చిత్ర షూటింగ్ కోసం అనువైన లొకేషన్స్ ని ఫైనల్ చేస్తున్నారు. దీనికోసం దర్శకుడు శంకర్ స్వయంగా తన టీం తో కలసి ఆ గ్రామాన్ని సందర్శించారు. 

దోసకాయల పల్లి లైబ్రరీ ముందు శంకర్ ఉన్న ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ ప్రాంతాల్లో షూటింగ్ కోసం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పోలీసులని అనుమతి కోరుతూ రాసిన లేఖ కూడా వైరల్ అవుతోంది. రాజమండ్రి, కాకినాడ, కోవూరు పరిసర గ్రామాలు, పొలాల్లో RC15 షూటింగ్ జరగనునట్లు.. అందుకోసం అనుమతి ఇవ్వాల్సిందిగా డిఐజి కి లేఖ రాశారు. ఫిబ్రవరి 10 నుంచి 28 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. 

కాబట్టి అనుమతితో పాటు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి షూటింగ్ విజయవంతం అయ్యేలా సహకరించాలని పోలీసులని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. 

Scroll to load tweet…