ప్రముఖ నటి శిల్పా శెట్టి సోదరి షమితా కారులో వెళుతుండగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ముగ్గురు యువకులు కారును ఢీకోట్టినట్లు చెబుతూ ఆమె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో ఈ వార్త బాలీవుడ్ లో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. గొడవకు గల కారణాల్లోకి వెళితే.. షమితాపై కావాలనే వ్యక్తులు అడ్డుతగిలారని డ్రైవర్ చెబుతున్నాడు. 

ఈ విషయంపై డ్రైవర్ తో పాటు షమితా కూడా థానేలోని రబోడీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కావాలని కారును ముగ్గురు వ్యక్తులు ఒక బండిపై వచ్చి ఢీకోట్టినట్లు చెబుతూ అసభ్యంగా దూషించారని అలాగే కారు డ్రైవర్ ను ఢీకోట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బైక్ ను గుర్తించినట్లు చెప్పారు. 

అదే విధంగా త్వరలోనే ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకొని విచారిస్తామని తెలియజేశారు. షమితా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. పిలిస్తే పలుకుతా అనే సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు.