ఇటీవల కాలంలో టాలీవుడ్‌కు కిక్కెక్కి్ంచిన చిత్రం అర్జున్ రెడ్డి శివ తర్వాత ఆ  స్థాయిలో ట్రెండ్ సెట్టర్ సినిమా అనే టాక్ సంపాదించుకొన్న అర్జున్ రెడ్డి హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ శాలిని పాండేకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు  తన జీవితంలో పడిన క‌ష్టాల‌ను తెలిపిన హిరోయిన్ శాలినిపాండే 

అర్జున్ రెడ్డి మూవీలో నటించిన హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, శాలిని పాండేకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. హీరోయిన్ శాలిని పాండే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ కథనం సోషల్ మీడీయాలో సంచలనం రేపుతున్నది. శాలిని తన జీవితంలో పడిన కష్టాలను, నటిగా స్థిరపడే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలను ఆ స్టోరీలో పేర్కొన్నారు, వివరాల్లోకి వెళితే.

సినిమా రంగంలోకి ప్రవేశించాలని ఇంజనీరింగ్ చదివే సమయంలోనే సినిమా రంగంలోకి ప్రవేశించాలని భావించింది షాలిని. తల్లిదండ్రుల బలవంతం చేయడంతో చదువును పూర్తి చేసింది, అదే సమయంలో థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ కూడ పొదింది. నటనలో ప్రతిభ చూపడంతో షాలిని కోరికను ఆమె తండ్రి కాదనలేక కొంతకాలం ప్రోత్సహించాడు, కానీ ఓ దశలో సినిమాల వైపు వద్దని కట్టడి చేయడంతో తండ్రితో విభేధించింది శాలిని.

ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని.. తన కల నెరవేర్చుకోవడానికి ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని షాలిని డిసైడ్ అయిందట. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని బావించింది. ముంబై లో ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి వారం రోజుల్లొ తిరిగి వస్తా అని చెప్పి ఇక తిరిగి వెనక్కి వెళ్లలేదు. తండ్రి ఎంత బ్రతిమిలాడిన వచ్చి కొట్టి తీసుకొస్తానని బెదిరించిన మొండికేసిందట. తిరిగి రావడం ఇష్టం లేదు నాన్న అని ఈ-మెయిల్ పెట్టిందట.

తన కేరీర్ కు అడ్డుపడుతుండట్తో తల్లితండ్రులపై పోలీస్ కేసు పెట్టాలని భావించిందట. పోలీస్ కంప్లయింట్ ఇస్తానని తండ్రి బెదిరిస్తే.. తాను మేజర్ అని తిరిగి, తనను టార్చర్ పెడుతున్నారని రివర్స్ కంప్లయింట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో చాలా బాధ పడిన షాలిని తండ్రి ఎప్పటికీ ఇంటికా తిరిగి రావోద్దని స్పష్టం చేశాడట

అలా కుటుంబ సభ్యులకు దూరమైన శాలిని చాలా కష్టాలు పడింది. తన వద్ద ఉన్న కొంత డబ్బుతో ఎలా గడపాలో తెలియక ఓ చిన్న గదిలో ఉందట. డబ్బులు మిగుల్చుకోవడానికి నడిచి వెళ్లడం, ఒక్కోసారి భోజనం మాని వేసిన దాఖలాలు కూడా ఉన్నాయట.అర్జున్ రెడ్డి' సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత షూటింగ్ మొదలు కావడానికి ఇంకా సమయం ఉండటంతో డబ్బులు సరిపోలేదట.

 దాంతో ఇద్దరు అబ్బాయిలతో ఒకే రూంను షేర్ చేసుకొవాల్సిన పరిస్థితిలో రెండు నెలలపాటు ఉండటం లాంటీ కష్టాలను అనుభవించిందట.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సిటీకి చెందిన ఒక గవర్నమెంట్ ఉద్యోగి కూతురైన శాలిని స్నేహితుల సహాయంతో అర్జున్ రెడ్డి అవకాశం అందుకున్నట్టు సమాచారం. తొలి ప్రయత్నమే అర్జున్ రెడ్డి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకొన్నది. అర్జున్ రెడ్డి సక్సెస్ తో అందర్నీ ఆకట్టుకున్నది. ప్రస్తుతం ఆమెకు మంచి ఆఫర్లు తలుపు తడుతున్నట్టు తెలుస్తున్నది.