'అర్జున్ రెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాలు చేసినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ఈ క్రమంలో ఆమెకి బాలీవుడ్ నుండి ఆఫర్ రావడం విశేషం. అది కూడా యష్ రాజ్ సంస్థ లాంటి టాప్ బ్యానర్ లో ఛాన్స్ రావడం గొప్ప విషయం. పైగా మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నారు. యష్ రాజ్ బ్యానర్ లోకి వెళ్లడమంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్లేనని బాలీవుడ్ లో చెబుతుంటారు.

రెమ్యునరేషన్ తక్కువే అయినప్పటికీ ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా.. ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయి. పైగా యష్ రాజ్ బ్యానర్ లో వచ్చేవన్నీ  కూడా భారీ సినిమాలే కాబట్టి మరింత క్రేజ్ ఏర్పడుతుంది.

తెలుగులో సరైన అవకాశాలు రాని షాలిని పాండేకి బాలీవుడ్ లో మూడు సినిమాలు చేసే ఛాన్స్ రావడంతో ఇతర హీరోయిన్లకు కన్ను కుడుతోంది. మొత్తానికి ఈ నార్త్ బ్యూటీ అనుకున్నది సాధించేలానే ఉంది. మరి హీరోయిన్ గా బాలీవుడ్ లో రాణిస్తుందేమో చూడాలి!