Bigg Boss Telugu 7ః షకీలా ఎలిమినేట్.. హౌజ్‌లో ఉన్న వెన్నుపోటుదారులెవరంటే?
బిగ్ బాస్ తెలుగు 7 రెండో వారం పూర్తయ్యింది. 15వ రోజు బిగ్ బాస్‌లో రెండో కంటెస్టెంట్ ఎలిమేషన్ జరిగింది. ఊహించినట్టే షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోటి కంటెస్టెంట్ల గురించి బోల్డ్ గా వెల్లడించారు.

ఇక ఆదివారం సండే, ఫండే కాబట్టి గేములతో స్టార్ట్ చేశారు హోస్ట్ నాగార్జున. మొదట `బిగ్ బాస్ సామ్రాజ్యం` అంటూ హౌజ్‌ని బాహుబలి సామ్రాజ్యంగా మార్చేశారు. ఇందులో ఒక్కొక్కరు తమకు ఎవరు భల్లాలదేవ(విలన్), ఎవరు కట్టప్ప(వెన్నుపోటు దారు) అనేది చెప్పాలి. ఇందులో శోభా శెట్టి చెబుతూ, తనకు యావర్ భల్లాల దేవ అని, గౌతమ్ కట్టప్ప అని చెప్పింది. గౌతం చెబుతూ, యావర్ భల్లాలదేవగా, రతిక కట్టప్పగా చెప్పారు. రతిక చెబుఊత భల్లాలదేవగా గౌతమ్ అని, కట్టప్ప తేజగా తెలిపారు. తేజ చెబుతూ, శివాజీ భల్లాల దేవగా, గౌతమ్ కట్టప్పగా తెలిపారు.
శివాజీ చెబుతూ, ప్రశాంత్.. భల్లాల దేవగా, తేజ.. కట్టప్ప అన్నారు. ప్రశాంత్ చెబుతూ, భల్లాల దేవ శివాజీ అని, కట్టప్ప తేజ అని, దామిని చెబుతూ, సందీప్ భల్లాల దేవ అని, శుభ శ్రీ కట్టప్ప అని, శుభ శ్రీ చెబుతూ, సందీప్ భల్లాలదేవగా, తేజ కట్టప్ప అని చెప్పారు. ప్రియాంక చెబుతూ, సందీప్ భల్లాల దేవ అని, శివాజీ కట్టప్ప అని చెప్పింది. యావర్ చెబుతూ, భల్లాల దేవ శివాజీ అని, సందీప్ కట్టప్ప అన్నారు. అమర్ దీప్ చెబుతూ భల్లాల దేవ సందీప్ అని, గౌతమ్ కట్టప్ప అని, షకీలా చెబుతూ ప్రశాంత్ భల్లాల దేవ అని, యావర్ కట్టప్ప గా తెలిపారు.
అనంతరం రణధీర, మహాబలి టీమ్‌ల మధ్య గెస్సింగ్ గేమ్ పెట్టారు. హీరోల కాస్ట్యూమ్స్ ఆధారంగా ఆ హీరో ఎవరు, సినిమా ఏంటో గుర్తించాలి. ఇందులో రణధీర టీమ్ కేవలం 2 పాయింట్లే సాధించింది. కానీ మహాబలి టీమ్ 8 పాయింట్లు సాధించి లగ్జరీ బడ్టెట్ గెలిచింది. ఇక ఫైనల్‌గా ఎలిమినేషన్ జరిగింది. చివర్లో తేజ, షకీలా మిగిలగా, ఇద్దరిలో ఊహించినట్టే షకీలా ఎలిమినేట్ అయ్యింది. దీంతో హౌజ్ మొత్తం ఎమోషనల్ అయ్యింది. తేజ, సందీప్, శోభ శెట్టి, ప్రియాంక, దామిని కన్నీళ్లు పెట్టుకున్నారు.
షకీలా హౌజ్ మేట్స్ గురించి చెబుతూ, వారి క్వాలిటీస్ ఏంటో తెలిసింది. ఇందులో ప్రియాంక ఫ్రెండ్లీనేచర్‌తో ఉంటుందని, ప్రిన్స్ యావర్ తనే గొప్ప అనే ఫీలింగ్‌లో ఉంటాడని, ప్రశాంత్‌కి ఆవేశం ఉంటుందని, దామిని నమ్మకానికి కేరాఫ్ అని, రతిక సోల్ హార్టెడ్ అని వెల్లడించింది. ఇక శివాజీ ఆనందం పంచుతాడని, అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడని తెలిపింది. ఈ సందర్భంగా తేజ బాగా ఎమోషనల్ అయ్యాడు. తాను తట్టుకోలేకపోయానని, ట్రూ ఎమోషన్ బయటకు వచ్చిందన్నారు. షకీలాని అమ్మగా భావిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు దామిని పాట పాడింది. అమ్మ పాట పడుతూ షకీలాకి కన్నీళ్లు తెప్పించింది.
14 మందితో బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రారంభం కాగా.. మొదటి వారంలో కిరణ్ రాథోర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఇద్దరు పెద్ద వయసున్న వారు ఎలిమినేట్ కావడం గమనార్హం. మరి మూడో వారం ఎవరు వెళ్లిపోతారు, కొత్తగా హౌజ్‌లోకి ఎవరు రాబోతున్నారనేది చూడాలి.