షకీలా ఒకప్పుడు మళయాళ సినిమాలను..ఆ తర్వాత తెలుగు పరిశ్రమను దున్నేసిన శృంగార తార. ఆ తర్వాత కాలంలో వయస్సు పెరగటం,సాప్ట్ ఫోర్న్ సినిమాలు తగ్గటంతో   ఆమె హవా తగ్గింది.  ఆ తర్వాత ఇమేజ్ మార్చుకుని కామెడీ వేషాలు మెదలెట్టింది. అయితే ఆ సినిమాలకు  మెల్లిగా గ్యాప్ కూడా వచ్చేసింది. అయితే చాలా రోజుల తరువాత షకీలా మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఆమె బయోపిక్. ఈ చిత్రానికి ‘షకీలా నాట్ ఎ పోర్న్ స్టార్’ అనేది టైటిల్.

 తెరపై కవ్వించే నటిగా ఒక వెలుగు వెలిగిన షకీలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నెల్లూరు జిల్లాకి చెందిన షకీలా ఎలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది? శృంగార తారగా షకీలా రాణించేందుకు ఎన్నికష్టనష్టాలను భరించిందో ఈ బయోపిక్  సినిమాలో చూపించనున్నారు.  అయితే ఈ సినిమాకు అనుకున్న స్దాయిలో క్రేజ్ రాలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినా పట్టించుకునేవారు లేరు. దాంతో బిజినెస్ కూడా జరగటం లేదని వినికిడి. పేరుకు షకీలా జీవితం అనేకానీ ఎక్కడా అడల్ట్ కంటెంట్ లేకుండా , తన ఇమేజ్ కు ఇబ్బంది కలగకుండా ఉండేలా రిచా చద్దా జాగ్రత్తలు తీసుకుందిట. ఈ నేపధ్యంలో  ఈ సినిమాకు ఎలాగైనా బూస్టప్ ఇవ్వాలనుకుటోంది షకీలా. 

రీసెంట్ గా ఓ ఇంటర్వూలో షకీలా మాట్లాడుతూ ఈ సినిమాలో తాను కొందరి పెద్దవారి పేర్లు బయిట పెట్టదలచుకున్నానటోంది. తన కెరీర్ ని నాశనం చేయటానికి ప్రయత్నించిన స్టార్ హీరోలు, తనని ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలని ప్రయత్నించిన హీరోలను డైరక్ట్ గా ప్రస్తావిస్తానంటోంది. అయితే ఇప్పుడు ఆ స్టార్ హీరోలు ఎవరేది ఆసక్తి కలుగుతుందని ఆమె ఆలోచన. దాంతో సినిమాకు కొద్దిగా అయినా క్రేజ్ వచ్చే అవకాసం ఉందని భావిస్తోంది.