ప్రస్తుతం చాలా మంది సినీ తారలు రాజకీయాలపై ఆసక్తి చూపుతూ వివిధ పార్టీల్లో చేరుతున్నారు. కమల్, రజిని లాంటి అగ్ర హీరోలు ఏకంగా రాజకీయ పార్టీలను స్థాపించారు. ఒకప్పటి మలయాళ నటి షకీలాకి కూడా ఇప్పుడు రాజకీయాలపై మనసు మళ్లినట్లుంది.

తాను కూడా రాజకీయాల్లో చేరి సేవ చేయాలనుకుంటున్నట్లు ఓ చర్చా వేదికలో వెల్లడించింది. ఎవరి పార్టీలో చేరతారని అడిగితే కమల్ హాసన్ పార్టీ అని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు ఆమె సినిమాలు విడుదలవుతున్నాయంటే స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి కలిగేది.

అలాంటిది ఆమెని కావాలని తొక్కేశారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితమైన ఆమె జీవిత కథను బాలీవుడ్ లో బయోపిక్ గా రూపొందిస్తున్నారు. ఇలా ఉండగా ఇటీవల ఓ భేటీలో పాల్గొన్న ఆమె కమల్ హాసన్ నటన అంటే చాలా ఇష్టమని, ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాల్లో అతని చిత్రాలే ఎక్కువగా చూస్తుంటానని చెప్పింది.

యన పెట్టిన పార్టీ మక్కల్ నీది మయ్యంలో చేరాలనుకుంటున్నట్లు, కొత్త ఆలోచనలతో ఆయన ప్రవేశ పెట్టనున్న పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని వెల్లడించింది. ఆయన పార్టీలో చేరి పని చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది.