ఫిదా సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకే తన తదుపరి సినిమా షూటింగ్ ని ఈ దర్శకుడు వేగంగా ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చినట్లు తెలుస్తోంది. 

నూతన నటీనటులతో ఈ రియాలిటీ దర్శకుడు మరో రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణలోని ఆర్ముర్ ఏరియాల్లో సినిమా షూటింగ్ ని నిర్వహిస్తున్నారు. ఈ షెడ్యూల్ అయిపోతే సినిమా షూటింగ్ దాదాపు 80శాతం ముగిసినట్లే. ఇక కమ్ముల వీలైనంత త్వరగా సినిమాను ఫినిష్ చేసి టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ ను ఆడియెన్స్ ముందు ఉంచాలని అనుకుంటున్నాడు. 

ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ సినిమాను నిర్మిస్తున్నారు. అయన కుమారుడే సినిమాలో హీరోగా నటిస్తుండగా కన్నడ బ్యూటీ అమృత అయ్యర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఇక సినిమాను సమ్మర్ చివరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.