తాజాగా మరోసారి హీరోగా తన లక్‌ని పరీక్షించుకోబోతున్నారు షకలక శంకర్. ప్రస్తుతం ఆయన `కార్పోరేటర్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో షకలక శంకర్ `కార్పోరేటర్` పేరుతో సినిమా చేయడం ఆసక్తి నెలకొంది.
హాస్యనటుడు షకలక శంకర్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మేనరిజంతో అటు హాస్యం, ఇటు యాక్షన్ మేళవిస్తూ హీరోగా రాణిస్తున్నారు. తాజాగా మరోసారి హీరోగా తన లక్‌ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన `కార్పోరేటర్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో షకలక శంకర్ `కార్పోరేటర్` పేరుతో సినిమా చేయడం ఆసక్తి నెలకొంది. తన రాజకీయాల్లో రూల్స్ లేవని శంకర్ టీషర్ట్ పై ఉండటం ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అని ఉంది, అంటే ఈ సినిమా విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో, అక్కడి షకలక శంకర్ రాజకీయాల ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని అర్థమవుతుంది. ఇందులో శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి సంజయ్ పూనూరి దర్శకత్వం వహిస్తున్నారు. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ పతాకాలపై ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్.వి.మాధురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
`ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో.. 5 పాటలు, 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంకర్ పెర్ఫార్మెన్స్ 'కార్పొరేటర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెప్పారు.
శంకర్ సరసన సునీత పాండే, లావణ్య శర్, కస్తూరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పీఆర్‌ఓ దీరజ అప్పాజీ, యాక్షన్ః వింగ్ చున్ అంజి, డాన్స్ః సూర్య కిరణ్, వెంకట్ దీప్, ఎడిటింగ్ః శివ శర్వాణి, కెమెరాః జగదీష్ కొమరి, సంగీతంః ఎం.ఎల్.పి. రాజా. సహనిర్మాతః డాక్టర్ ఎస్.వి.మాధురి, నిర్మాతః సహ నిర్మాత: డాక్టర్ ఎస్.వి.మాధురి, నిర్మాత: ఎ.పద్మనాభరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంజయ్ పూనూరి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 30, 2020, 1:12 PM IST