షకలక శంకర్: సినిమాల్లేక తిండి కూడా లేదు అందుకే ఇలా అయిపోయా

shakalaka shankar emotional words about pawan kalyan
Highlights

 అందరూ నేను నేను ఎక్స‌ర్‌సైజులు చేసి బ‌రువు త‌గ్గాన‌ని అనుకున్నారు . కానీ రెండేళ్లు సినిమాలు లేక‌.. తిండి లేక త‌గ్గిపోయాను

'జబర్దస్త్' షోతో సూపర్ పాపులారిటీ దక్కించుకున్న షకలక శంకర్ సినిమాలలో కూడా కమెడియన్ రోల్స్ లో కనిపించి మెప్పించాడు. రీసెంట్ గా విడుదలైన 'అమ్మమ్మగారిల్లు' సినిమాలో కూడా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో బాగా నవ్వించాడు. అయితే షకలక శంకర్ హీరోగా శ్రీధర్ అనే నూతన దర్శకుడు 'శంభో శంకర' సినిమాను రూపొందించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా షకలక శంకర్ కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు..

''నేను పవన్ కళ్యాణ్ గారిని మనసులో పెట్టుకునే పని చేశాను. అందుకే ఈస్థాయికి ఎదగగలిగాను..  అందరూ నేను నేను ఎక్స‌ర్‌సైజులు చేసి బ‌రువు త‌గ్గాన‌ని అనుకున్నారు . కానీ రెండేళ్లు సినిమాలు లేక‌.. తిండి లేక త‌గ్గిపోయాను. అలాంటి టైమ్‌లోనే ఈ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. నా వంతు ప్ర‌య‌త్నం చేశాను. ఫ‌లితాన్ని ప్రేక్ష‌కులే నిర్ణ‌యిస్తారు'' అని స్పష్టం చేశాడు. టీజర్ లో అయితే హీరో రేంజ్ కు ఏమాత్రం తగ్గని ఫైట్లు, డాన్సులు చేసేశాడు షకలక శంకర్. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

 

loader