Asianet News TeluguAsianet News Telugu

`సైతాన్‌` వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. మహి వీ రాఘవ్‌ సక్సెస్‌ అయ్యాడా?

దర్శకుడు మహి వీ రాఘవ్‌ రూట్‌ మార్చి సంచలన వెబ్‌ సిరీస్‌ `సైతాన్‌`ని తెరకెక్కించారు.  బోల్డ్ కంటెంట్‌తో ఇప్పటికే ట్రైలర్‌తో హాట్‌ టాపిక్‌ గా మారిన ఈ సిరీస్‌ నేడు(జూన్‌ 15న) హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ట్రైలర్‌లో మాదిరిగానే వెబ్‌ సిరీస్‌ ఉందా? అంతకు మించి ఉందా? అనేది రివ్యూ లో తెలుసుకుందాం. 

shaitan web series review rating arj
Author
First Published Jun 15, 2023, 3:13 PM IST

దర్శకుడు మహి వీ రాఘవ్‌.. `ఆనందో బ్రహ్మా`, `యాత్ర` వంటి చిత్రాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. మంచి సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు. సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్స్ తోనూ ఆకట్టుకుంటున్నారు. ఆయన తాజాగా ఓ సంచలన వెబ్‌ సిరీస్‌ `సైతాన్‌`ని తెరకెక్కించారు. తన జోనర్‌ మార్చి బోల్డ్ కంటెంట్‌తో ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించారు. ఇప్పటికీ ట్రైలర్‌లో హాట్‌ టాపిక్‌ గా మారింది `సైతాన్‌`. బోల్డ్ కంటెంట్‌ అందరిని ఆశ్చర్యపరిచింది. మాటల్లో చెప్పలేని డైలాగులతో సాగడంతో దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దర్శకుడు మహి వీ రాఘవ్‌ కూడా దీన్ని ఫ్యామిలీతో చూడొద్దని వ్యక్తిగతంగానే చూడాలని, బోల్డ్ కంటెంట్‌ని ఇష్టపడే వారికి నచ్చుతుందన్నారు. ఈ నేపథ్యంలో నేడు(జూన్‌ 15న) ఈ వెబ్‌ సిరీస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ట్రైలర్‌లో మాదిరిగానే వెబ్‌ సిరీస్‌ ఉందా? అంతకు మించి ఉందా? అనేది రివ్యూ లో తెలుసుకుందాం. 

కథః 

సావిత్రి(షెల్లీ నబు కుమార్‌) భర్త చనిపోవడంతో పిల్లలు బాలి(రిషి), జయ(దేవయాని శర్మ), గుత్తి(జాఫర్‌ సాధిక్‌)ల పోషణ కోసం ఎవరూ పని ఇవ్వరు. ప్రతి ఒక్కడు పక్కన పడుకోవడానికే సిద్ధపడుతుంటారు. దీంతో ఓ పోలీస్‌కి ఉంపుడుగత్తగా ఉంటుంది. సమాజంలో ఆమె అనేక అవమానాలు, వేధింపుల నేపథ్యంలో పోలీస్‌కి ఉంపుడు గత్తెగా ఉండటం బెటర్‌ అనుకుంటుంది సావిత్రి. కానీ ఆ పోలీస్‌ కన్ను తన కూతురు మీద పడటంతో అందరు కలిసి ఎదురుతిరుగుతారు. ఆ పోలీస్‌ని చంపేస్తారు. ఈ నేరానికి బాలి జైలుకెళ్తాడు. ఆ తర్వాత డబ్బుల కోసం ఇలాంటి నేరాలు చేసి జైలుకెళ్తూ బయటకు వస్తూ ఉంటాడు. ఓ రోజు నక్సల్స్ ఓ గ్రామానికి వచ్చి ఓ భూస్వామిని చంపేసిన నేపథ్యంలో పోలీసుల నుంచి నక్సల్స్ రక్షించే క్రమంలో కళావతి అనే నక్సల్‌ సానుభూతిపరురాలికి దగ్గరవుతాడు. ఆమె కారణంగా నక్సల్‌గా మారతాడు. నక్సల్స్ లోకి వెళ్లిన బాలిని ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, తన తల్లి, చెల్లి, తమ్ముడు ఎలా సర్వైవ్‌ అయ్యారు? తన కుటుంబం కోసం బాలి ఏం చేశాడు? ఫ్యామిలీ ఎదుర్కొన్న వేధింపులేంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన కథ. Shaitan Web Series Review

విశ్లేషణః

`సైతాన్‌` వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌లో బూతు కంటెంట్‌తో, బోల్డ్‌ గా, క్రైమ్‌తో నిండి ఉంది. అయితే వెబ్‌ సిరీస్‌ మాత్రం మరీ అంత జుగుస్పాకరంగా మాత్రం లేదు. కాకపోతే కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయి, భయం పుట్టించే క్రైమ్‌ సీన్లు ఉన్నాయి. రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇందులో చాలా ఎమోషన్‌ ఉంది. ఒక ఫ్యామిలీ పెయిన్‌ ఉంది. చిన్నప్పట్నుంచి పడే ఇబ్బందులు, అవమానాలు, చీదరింపులు, పస్తులుండాల్సిన పరిస్థితి నుంచి వాళ్లు ఎలా క్రైమ్‌లోకి దిగారనేది, తమ సర్వైరింగ్‌ కోసం వాళ్లు ఎంత కఠినంగా మారారనేది చాలా పెయిన్‌ఫుల్‌గా చూపించాడు దర్శకుడు మహి వీ రాఘవ్‌. వెబ్‌ సిరీస్‌ కావడంతో చాలా ఫ్రీడమ్‌ తీసుకున్నారు. ట్రైలర్‌లో ఉన్నట్టుగానే కొన్ని బోల్డ్ పదాలు వాడారు. వాడుకలో పచ్చిగా మాట్లాడుకున్నట్టుగానే ఇందులో పెట్టడం మధ్య మధ్యలో గుచ్చుకునేలా ఉంటాయి. Shaitan Web Series Review

అయితే బాలి జర్నీ నడిచిన తీరు మాత్రం `నయీమ్‌ డైరీస్‌`ని గుర్తు చేస్తుంది. ఓ వైపు తమ ఫ్యామిలీ మణుగడ కోసం పోరాటం ఈ క్రమంలో నక్సల్స్ కి దగ్గరవడం, తన డేర్‌నెస్‌ని చూసి నక్సల్స్ అతన్ని ఎంకరేజ్‌ చేయడం, వారికి కావాల్సిన హత్యలు చేసిన తక్కువ కాలంలోనే నక్సల్స్ మెప్పుపొందడం, కొన్ని మిస్‌ అండర్‌స్టాండింగ్‌, నమ్మకద్రోహం, వాస్తవాలు గ్రహించలేని తనం నుంచి బాలి జర్నీ విపరీతమైన క్రైమ్‌లోకి దిగేలా చేయడం వంటి సన్నివేశాల్లో నిజాయితీ, ఇంటెన్సిటీ కనిపిస్తుంది. దీంతో తెలియకుండానే ఆడియెన్స్ ఈ కథలో లీనమై ట్రావెల్‌ చేస్తుంటారు. మనుగడ కోసం ఒక్కసారి కత్తి పట్టి క్రైమ్‌ చేస్తే, అది వెంటాడుతూనే ఉంటుందనేది చరిత్ర చెప్పిన సత్యం. బాలి విషయంలో అదే జరిగింది. అతను క్రైమ్‌ వదిలేద్దామనుకున్న ప్రతిసారి ఏదో రూపంలో క్రైమ్‌ అతన్ని తనలో లాగేసుకుంటుంది. చివరికి అతన్ని జీవితాన్ని బలితీసుకుంటుందనేది ఈ వెబ్‌ సిరీస్‌ సారాంశం. 

కొన్ని బోల్డ్ సన్నివేశాలు, కొంత బూతు డైలాగులు, శృతి మించిన క్రైమ్‌ సీన్లు పాత్రల ఎమోషన్స్, కథలోని ఇంటెన్సిటీ ని డామినేట్‌ చేస్తుంది. దాన్ని దాటి చూస్తే ఇందులో అంతులోని బాధ ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది, చేతకాని తనం ఉంటుంది, తప్పని పరిస్థితిలో చేసే తిరుగుబాటు ఉంటుంది. కదిలించే సన్నివేశాలున్నాయి, ఆలోచింప చేసే డైలాగులున్నాయి, గుండెబరువెక్కించే సీన్లు ఉన్నాయి, కొంత ప్రేమ ఉంది, కొంత బాధ్యత ఉంది, చివర్లో పోలీస్‌, నేరస్థుడి మధ్య స్నేహం ఉంది. అది ఎమోషనల్‌గానూ చూపించడం ఈ వెబ్‌ సిరీస్‌ ప్రత్యేకత. దీనికితోడు నక్సలైట్లలోని లోపాలను, రాజకీయ నాయకులలోని లోపాలను, నేరస్థులను పోలీసులు ఎలా వాడుకుంటారో అనే కఠినమైన నిజాలను చూపించారు. వెబ్‌ సిరీస్‌ చివరి వరకు చూస్తే ఇందులో బోల్డ్ సీన్ల కంటే ఆ ఎమోషన్సే గుర్తుంటాయి, అయితే ఆ క్రైమ్‌ కూడా తప్పుకాదనే ఫీలింగ్‌ని కూడా కలిగిస్తుంది. 

నటీనటులుః
బాలీ పాత్రలో రిషి అద్భుతంగా నటించాడు. బీభత్సమైన క్రైమ్‌ చేస్తున్నా, అతనిలో నవ్వు కనిపించడం ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ ని బాగా పలికించాడు. ఇంటెన్సిటీ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. సినిమాకి మెయిన్‌ పిల్లర్‌గా నిలిచాడు. అమ్మ సావిత్రి పాత్రలో షెల్లీ నటన ఆకట్టుకుంటుంది. బోల్డ్ సీన్లలో ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అలాగే జయ పాత్రలో దేవయాని శర్మ నటన మెప్పిస్తుంది. ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. జాఫర్‌ మరోసారి మెప్పించాడు. సహజంగా నటించాడు. పాత్రకి యాప్ట్ గా నిలిచాడు. కళావతి పాత్రలో కామాక్షి భాస్కర్‌ ఉన్నంతలో ఫర్వాలేదు. పోలీస్‌ అధికారిగా రవి కాలే అదరగొట్టాడు. సినిమాకి మరో పిల్లర్‌ అయ్యారు. వీరితోపాటు మణికందన్‌ సైతం మెప్పించాడు. 

టెక్నీకల్‌గాః 
మహి వీ రాఘవ్‌ దర్శకుడిగా తనని కొత్తగా ఆవిష్కరించుకున్న తీరు బాగుంది. కాకపోతే ఇంతటి బోల్డ్ గా కథ చెప్పడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కన్విన్సింగ్‌గా అనిపించలేదు. బట్‌ తాను అనుకున్న దాంట్లో సక్సెస్‌ అయ్యాడు. ఇంటెన్సిటీ, ఎమోషన్స్ విషయంలో ఇంకా బాగా చూపించాల్సింది. ఎమోషన్స్, వారి పెయిన్‌ డోస్‌ కి, వారు చేసే క్రైమ్‌కి సింక్‌ కాలేదు. ఆ విషయంలో కేర్‌ తీసుకోవాల్సింది. శ్రీరామ్‌ మద్దూరి బీజీఎం కథకి తగ్గట్టుగా ఉంది. యాప్ట్ గా నిలిచింది. షణ్ముగ సుందరం విజువల్స్ బాగున్నాయి. మహి వీ రాఘవ్‌, చిన్నా వాసుదేవ్‌రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా క్వాలిటీగా తీశారు. Shaitan Web Series Review

ఫైనల్‌గాః ఇది ఫ్యామిలీ కలిసి చూసే సిరీస్‌ కాదు, బోల్డ్ సీన్లు, క్రైమ్‌ని, రా అండ్‌ రస్టిక్‌ని ఇష్టపడే వారు ఎంజాయ్‌ చేసే వెబ్‌ సిరీస్‌ అవుతుంది. 
రేటింగ్‌ః 2.75

నటీనటులు : రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న, కామాక్షీ భాస్కర్ల, మణికందన్ తదితరులు
ఛాయాగ్రహణం : షణ్ముగ సుందరం 
సంగీతం : శ్రీరామ్ మద్దూరి
నిర్మాతలు : మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి
రచన, దర్శకత్వం : మహి వి రాఘవ్
విడుదల తేదీ: జూన్ 15, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios