ఆ పోటీలో ప్రభాస్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్ ఉంటూంటారు. అయితే తాజాగా ప్రస్తుతం ఇండియాలో హైయిస్ట్ పెయిడ్ హీరో ఎవరనేది బయిటకు వచ్చింది.
సినీ ప్రియుల్లో ఎప్పుడూ నడిచే ఒకే టాపిక్..ఎవరు ఆల్ ఇండియా సూపర్ స్టార్...అలాగే ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అనేది. దాన్ని బట్టే ప్యాన్ ఇండియా హీరోల లెవిల్స్ అంచనా వేస్తూంటారు. ఆ పోటీలో ప్రభాస్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్ ఉంటూంటారు. అయితే తాజాగా ప్రస్తుతం ఇండియాలో హైయిస్ట్ పెయిడ్ హీరో ఎవరనేది బయిటకు వచ్చింది.
ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా కొద్ది కాలం క్రితం వరకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ 150 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు చెప్తారు. ఇప్పుడు దీనిని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బ్రేక్ చేశారు. పఠాన్ సినిమాకి షారుఖ్ ఏకంగా రెమ్యూనరేషన్ సినిమా ప్రాఫిట్ లో లాభాలు కలిపి 200 కోట్ల వరకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
సినిమా ప్రాఫిట్ లో 60% షేర్ ఇచ్చేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా ముందుగానే కమిట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పఠాన్ సినిమాకి రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా షారుఖ్ ఖాన్ తీసుకున్నారు. తద్వారా ఏకంగా 200 కోట్లు ఈ సినిమా ద్వారా బాద్షా ఆదాయం పొందారని తెలుస్తోంది. దీంతో ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చారు అనే మాట బాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.
జనవరి 25న రిలీజ్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి దాంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
