‘మామ్’ ఫిల్మ్ శ్రీదేవి చివరిదా? ఆమె మరో సినిమాలో నటించినట్టు తెలుస్తోంది. షారూక్, కత్రినాకైఫ్, అనుష్కా శర్మ కాంబోలో రానున్న మూవీ ‘జీరో’. ఇందులో శ్రీదేవి గెస్ట్‌గా కనిపిస్తుందని సమాచారం. రియల్ లైఫ్ మాదిరిగానే శ్రీదేవి కనిపించబోతున్నారట.  ఆ సన్నివేశంలో షారూక్, అలియాభట్, కరిష్మాకపూర్‌లతో కలిసి శ్రీదేవి హంగామా చేస్తారని, దీనికి సంబంధించి ఇప్పటికే చిత్రీకరణ పూర్తి అయ్యిందని బాలీవుడ్ సమాచారం.ఈ లెక్కన అతిలోక సుందరి ఫైనల్ మూవీ ‘జీరో’ అన్నమాట. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్‌లో.. రాయ్- రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ‘జీరో’ని తెరకెక్కిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.